ఆ డైరెక్టర్ పైనే రవితేజ ఫ్యాన్స్ ఆశలన్నీ!
మాస్ మహారాజా రవితేజ వరుసగా సీరియస్ ఎంటర్టైనర్లు చేస్తూ వెళ్తున్నాడు. కథ పరంగా కొత్తగా ఉండటంతో రవితేజ ప్రయోగాలు చేయడం, అవి రవితేజకు నిరాశను మిగల్చడమే జరుగుతోంది. దీంతో ఫ్యాన్స్ మళ్లీ వింటేజ్ రవితేజ కావాలని డిమాండ్ చేస్తున్నారు. రవితేజ నుంచి ఫ్యాన్స్ ధమాకా లాంటి ఎంటర్టైనర్ ను ఆశిస్తుండటంతో ప్రయోగాలకు గుడ్ బై చెప్పమంటున్నారు.
ప్రయోగం చేద్దామని నెగిటివ్ టచ్ ఉన్న రావణాసుర మూవీ చేస్తే డిజాస్టర్ అయింది. టైగర్ నాగేశ్వరరావు సినిమాను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రిలీజ్ చేస్తే ఆ సినిమా కూడా కమర్షియల్ గా నష్టాలనే మిగిల్చింది. తాజాగా రిలీజ్ అయిన ఈగల్ సినిమా కూడా మిక్డ్స్ టాక్ ను తెచ్చుకుంది. చూస్తుంటే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా అద్భుతాలేమీ చేసేలా లేదు.
దీంతో ఎలాగైనా రవితేజ తన తర్వాతి సినిమాతో హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం రవితేజ, హరీష్ శంకర్ దర్శకత్వంలో బాలీవుడ్ హిట్ మూవీ రైడ్ ను మిస్టర్ బచ్చన్ అనే పేరుతో రీమేక్ చేస్తున్నాడు. పేరుకే రీమేక్ కానీ హరీష్ శంకర్ ఈ సినిమాలోని మూల కథను మాత్రమే తీసుకుని దాన్ని రవితేజ స్టైల్ కు అనుగుణంగా మార్చాడని తెలుస్తోంది. కథ పరంగా మంచి స్టోరీ, పైగా డైరెక్టర్ హరీష్ శంకర్ కావడంతో ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న మిస్టర్ బచ్చన్ ఈ ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానుంది.