ఈగల్‌కు నష్టం తప్పేలా లేదుగా
మాస్ మహారాజా రవితేజ, కార్తీక్ ఘట్టమనేని కాంబినేషన్ లో తెరకెక్కిన ఈగల్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కావడానికి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటుంది. సంక్రాంతికి పోటీ ఎక్కువ ఉండటంతో ఈ సినిమాను రిపబ్లిక్ డే నాటికి పోస్ట్ పోన్ చేస్తారని వార్తలొచ్చిన నేపథ్యంలో వాటిని కొట్టిపడేస్తూ నిర్మాణ సంస్థ సంక్రాంతికే ఈగల్ రానున్నట్లు వెల్లడించింది.
అయితే ఈగల్ సినిమాకు ఎలాగైనా సరే నష్టం తప్పేలా లేదు. ముందు రోజు వస్తున్న గుంటూరు కారం సినిమాను ఢీ కొట్టడం అంత ఈజీ టాస్కేమీ కాదు. ఆ సినిమా తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ దృష్టి హనుమాన్ పై ఉంటుంది. ఇక మాస్ ఆడియన్స్ ను టార్గెట్ చేసి నాగార్జున ఉన్నాడు. ఫ్యామిలీ సెంటిమెంట్స్ తో పాటూ గణేష్ లాంటి మాస్ ఎలిమెంట్స్ సైంధవ్ లో ఉంటాయని వెంకీ చెప్తున్నాడు.
ఇవన్నీ చూసుకుంటే కొద్దో గొప్పో నష్టం ఎక్కువ వచ్చేది ఈగల్‌కే. డిఫరెంట్ స్టైల్ లో యాక్షన్ డ్రామా గా రూపొందిన ఈగల్ అసలు పండగ సినిమా కానే కాదు. కానీ రిలీజ్ డేట్ విషయంలో తగ్గేదేలే అని నిర్మాతలంటున్నారు. సరేలే రిపబ్లిక్ డేకు వద్దామంటే అక్కడ కూడా పోటీ బాగానే ఉంది. తంగలాన్, ఫైటర్ సినిమాలు అదే రోజున రిలీజ్ కానున్నాయి. తెలుగులో వాటి ఎఫెక్ట్ పెద్దగా ఉండకపోయినా మిగిలిన భాషల్లో మాత్రం ఆ రిజల్ట్ బాగానే కనిపిస్తుంది. కాకపోతే సంక్రాంతి పోటీ కంటే రిపబ్లిక్ డే పోటీ చాలా బెటర్ అనేది మాత్రం వాస్తవం. మరి ఈ నేపథ్యంలో ఈగల్ మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.