విజయ్ విషయంలో రష్మిక క్లారిటీ ఇచ్చేసినట్టే!
రీసెంట్ గా జరిగిన గంగం గణేశా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్టు గా రష్మిక మందన్నా హాజరైన విషయం తెలిసిందే. రష్మిక రాకతో సినిమా కంటెంట్ హైలైట్ అవుతుందనుకుంటే మరో అంశం హైలైట్ అయింది. ఈ ఈవెంట్ లో ఆనంద్ దేవరకొండ సరదాగా రష్మికను ఇంటర్య్వూ చేశాడు. అందులో భాగంగా రష్మిక చెప్పిన ఆన్సర్లు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. రష్మికను ఫేవరెట్ కో స్టార్ ఎవరని అడగ్గానే దానికి ఆన్సర్ ఇస్తూ నా ఫ్యామిలీ అయ్యుండి ఇలా ట్రిక్ చేస్తావా అని అనడమే కాకుండా, రౌడీ బాయ్ అని చెప్పిన ఆన్సర్.. విజయ్ తో తన బంధం గురించి ఉన్న డౌట్స్ ను క్లియర్ చేసినట్లే అయిందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు రష్మిక ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆనంద్ దేవరకొండకు సంబంధించిన ఈవెంట్స్ కు హాజరవుతూనే ఉంటుంది.
గతంలో బేబీ సాంగ్ లాంఛ్ కు వచ్చిన రష్మిక ఇప్పుడు తన టైట్ షెడ్యూల్ లో గంగం గణేశా ఈవెంట్ కు హాజరైంది. అంతేకాదు, ఆనంద్ తో రష్మిక మాట్లాడే క్రమంలో మ్యూట్ లో మాత్రమే వినాల్సిన ఒక మాటను ఎంతో చనువుగా అనేసింది రష్మిక. ఆ మాట చనువుగా ఉంటే తప్పించి మామూలు బాండింగ్ లో అయితే రావు. దానికి తోడు మన ఫ్యామిలీ అని నొక్కి మరీ చెప్పడంతో రష్మిక- విజయ్ రిలేషన్ గురించి వస్తున్న వార్తలకు బలం చేకూరింది.