ASBL NSL Infratech

అనుకున్నది సాధించి కన్నుమూసిన రామోజీ రావు!

అనుకున్నది సాధించి కన్నుమూసిన రామోజీ రావు!

రామోజీ రావు మీడియా రంగంలో ఒక సంచలనం. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా పత్రిక, మీడియా, వ్యాపార రంగాల్లో అద్భుత విజయం సాధించి ఔరా అనిపించుకున్నారాయన. మార్గదర్శి చిట్ ఫండ్స్, అన్నదాత, డాల్ఫిన్ హోటల్స్, ప్రియ పచ్చళ్లు, కళాంజలి, ఈనాడు, ఈటీవీ, రమాదేవి పబ్లిక్ స్కూల్, బ్రిసా, రామోజీ ఫిలిం సిటీ.. లాంటి వినూత్న ఐడియాలతో తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. తాను ప్రారంభించిన వాటిని అత్యునత స్థాయికి తీసుకెళ్లడంలో ఆయన సక్సస్ సాధించారు. అయితే ఆయన జీవితం పూలపాన్పేమీ కాదు. ఆయన కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

రామోజీరావు మీడియా అధినేతగా సుపరిచితులు. ప్రభుత్వాలను కూడా ఆయన శాసిస్తుంటారని చెప్తుంటారు. ముఖ్యంగా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు ఆయనకు పూర్తిస్థాయి మద్దతు పలికి అండగా నిలిచారు. ఎన్టీఆర్ ను నాదెండ్ల భాస్కర్ రావు వెన్నుపోటు పొడిచినప్పుడు రామోజీ ఉద్యమ తరహాలో ఈనాడును నడిపించినట్లు చెప్పుకుంటారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా రామోజీ వేసిన అడుగులను కొందరు హర్షిస్తే.. మరికొందరు తిడుతుంటారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు వ్యవహారం, మార్గదర్శి అంశాలు వివాదాలకు కారణమయ్యాయి. అయినా ఆయన వెన్ను చూపలేదు. పెద్దలా.. గద్దలా.. పేరుతో ఈనాడులో ఆయన రాసిన వార్త పెద్ద సంచలనానికి కారణమైంది. ఔటర్ రింగ్ రోడుల్లో ప్రభుత్వ అవకతవకలను ఎండగట్టింది.

వైఎస్ ప్రభుత్వ అవకతవకలను ఎండగట్టినందువల్లే మార్గదర్శి అంశాన్ని తెరపైకి తెచ్చి కేసులు పెట్టినట్టు ఆయన సన్నిహితులు చెప్తుంటారు. ఇప్పటికీ మార్గదర్శి కేసు నడుస్తోంది. ఇదే అంశంపై తాజా మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా రామోజీ రావును టార్గెట్ చేశారు. ఆయనకు నోటీసులు పంపించి విచారణ జరిపారు. ఒకానొక దశలో ఆయన్ను అరెస్టు చేస్తారేమోనని అందరూ అనుకున్నారు. అయితే రామోజీకి ఆరోగ్యం సరిగా లేకపోయినా జగన్ కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శలు వ్యక్తమయ్యాయి. రామోజీ రావు మాత్రం వెనకడుగు వేయలేదు.

ఎన్నికల్లో జగన్ కు వ్యతిరేకంగా ఓటేయాలని.. ఆయన్ను సాగనంపాలని రామోజీరావు ఏకంగా ప్రజలకు పిలుపునిచ్చారు. ఈనాడులో ఎడిటోరియల్ రాశారు. ఇలా ఒక పార్టీని ఓడించాలంటూ రామోజీరావు స్టాండ్ తీసుకోవడం ఆశ్చర్యపరిచింది. ఆయన కోరుకున్నట్టుగానే 4వ తేదీన వెల్లడైన ఫలితాల్లో జగన్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. ఆరోజు ఎన్నికల ఫలితాల తర్వాత ఈనాడు, ఈటీవీ ప్రతినిధులతో ఆయన సమీక్ష కూడా నిర్వహించారు. మరుసటి రోజు నేలకొరిగిన నియంత పేరుతో ఎడిటోరియల్ కూడా రాశారు. ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. జగన్ ను ఓడించాలనే సంతోష సమయాలు గడుపుతున్న సమయంలోనే ఆయన 5న గుండెపోటుకు గురై ఆసుపత్రిలో చేరారు. ఇవాళ కన్నుమూశారు. చివరి సమయాల్లో ఆయన అనుకున్నది సాధించి సంతోషంతో కన్నుమూశారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :