రామ్.. ఇది మరీ టూ మచ్!
దేవదాసు మూవీతో టాలీవుడ్ కు పరిచయమైన రామ్ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ కెరీర్ ను ముందుకు తీసుకెళ్లిన రామ్ ఇస్మార్ట్ శంకర్ తో కెరీర్ బెస్ట్ అందుకున్నాడు. ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ చేస్తున్నాడు రామ్. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో ఎలాగైనా భారీ హిట్ కొట్టాలని చూస్తున్నాడు రామ్.
డబుల్ ఇస్మార్ట్ ను శివరాత్రికి రిలీజ్ చేయాలనుకున్నారు కానీ కుదరలేదు. ఆ తర్వాత సమ్మర్ రిలీజ్ అన్నారు. ఇప్పుడు అది కూడా అయ్యేట్లు కనిపించడం లేదు. డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ గురించి కూడా ఎటువంటి అప్డేట్ లేదు. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం రామ్ భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుటున్నట్లు సమాచారం. డబుల్ ఇస్మార్ట్ కోసం రామ్ ఏకంగా రూ.25 కోట్లు తీసుకుంటున్నాడట.
అంతే కాదు కొత్త సినిమాలు ఒప్పుకోవాలంటే రూ.30 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నాడట. దీంతో సదరు యువ హీరోతో సినిమాలు చేసేందుకు అగ్ర దర్శకనిర్మాతలు ఎవరూ ముందుకు రావడం లేదు. రీసెంట్ గా ఓ స్టార్ డైరెక్టర్, రామ్ తో డిస్కషన్స్ చేశారని, ఆ టైమ్ లో రామ్ అడిగిన రెమ్యూనరేషన్ విని డ్రాప్ అయ్యారని సమాచారం. ఆ రేంజ్ రెమ్యూనరేషన్ ఇచ్చుకోలేమని ఆ ప్రాజెక్ట్ ను వదిలేశారట. ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ చేసిన సినిమాలేవీ ఆకట్టుకోలేకపోయాయి. అయినప్పటికీ రామ్ మాత్రం తన రెమ్యూనరేషన్ ను పెంచుతుంటే మేకర్స్ ఆయనతో మూవీ చేయడానికి వెనుకడుగేస్తున్నారు. ఓ రెండు హిట్లు పడేవరకు రామ్ రెమ్యూనరేషన్ ను తగ్గించుకుంటే మంచిదని సినీ పండితులంటున్నారు.