ASBL Koncept Ambience
facebook whatsapp X

రికార్డు సమయంలో ఆ ఎయిర్‌పోర్టు ను పూర్తి చేస్తాం : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

రికార్డు సమయంలో ఆ ఎయిర్‌పోర్టు ను పూర్తి చేస్తాం : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

తనకు అప్పగించిన పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు సంపూర్ణ న్యాయం చేస్తానని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు అన్నారు. ఢిల్లీలోని రాజీవ్‌ గాంధీ భవన్‌లో పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. క్యాబినెట్‌లో అత్యంత చిన్న వయసులో ఉన్న నాపై బాధ్యత పెట్టారు. ఇది యువతపై ప్రధానికి ఉన్న నమ్మకం. పౌర విమానయాన శాఖ ఇచ్చిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. మంత్రిత్వ శాఖకు సంబంధించి 100 రోజుల యాక్షన్‌ ప్లాన్‌ అమలు చేయనున్నాం. సాంకేతిక వినియోగంతో పౌర విమానయాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం. సామాన్యుడికి ఈజ్‌ ఆఫ్‌ ఫ్లయింగ్‌ తీసుకువస్తాం. ప్రయాణికుడికి భద్రత,  సౌకర్యంగా ఉండేలా చూస్తాం. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయకత్వంలో గత 10 సంవత్సరాలు ఎంపీగా పని చేశా. సమర్థ నాయకత్వం ఎలా ఉండాలనేది ఆయన నుంచి నేర్చుకున్నా. ఎయిర్‌పోర్టులను పర్యావరణ హితంగా చేయడానికి చర్యలు తీసుకుంటాం.  టైర్‌2, టైర్‌3 నగరాలకు విమానాశ్రయాలు తీసుకురావడం, విమానయానం సామాన్య ప్రయాణికుడికి అందుబాటులోకి తీసుకురావడమే మా లక్ష్యం అన్నారు.

అశోక్‌ గజపతి రాజు గతంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన హయాంలో ప్రయాణికులకు సదుపాయాలు కల్పించడంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ విమానయానికి అద్భుతంగా పునాదులు వేశారు.  ఉడాన్‌ స్కీమ్‌ కూడా ఆయన మంత్రిగా ఉన్నప్పుడే అమలు చేసి టైర్‌2, టైర్‌ 3 సిటీలతో పాటు సామాన్యుడికి విమానయాన అవకాశం కల్పించారు. దీన్ని మరింత విస్తారిస్తామన్నారు. ప్రధాని మోదీ, చంద్రబాబు లాంటి విజనరీ లీడర్స్‌ ఉండటం నాకు కలిసొచ్చే అంశం. దేశ ప్రజలు గర్వపడేలా బాధ్యతలు నిర్వర్తిస్తా. భోగాపురం ఎయిర్‌పోర్టుకు అశోక్‌ గజపతిరాజు హయాంలో పునాది పడిరది. గత ఐదు సంవత్సరాల్లో అక్కడ అభివృద్ధి కుంటుపడిరది. రికార్డు సమయంలో ఆ ఎయిర్‌పోర్ట్‌ను పూర్తి చేసి విమానాలను ల్యాండ్‌  చేస్తాం.  వచ్చే డిసెంబర్‌ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా. దీనిపై ఆంధ్రప్రదేశ్‌  సీఎం చంద్రబాబుతో చర్చిస్తాం. విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలకు డొమెస్టిక్‌, ఇంటర్నేషనల్‌ కనెక్టివిటీని మరింత పెంచుతాం. రాజమహేంద్రవరం, కడప, కర్నూలు ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేస్తాం. తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదించి అక్కడి విమానయాన శాఖ కార్యక్రమాలను ప్రోత్సాహం అందిస్తాం అని తెలిపారు.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :