సినిమాల విషయంలో రామ్ చరణ్ ప్లానింగ్

ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ తర్వాతి సినిమాల విషయంలో స్పీడు పెంచాలనుకున్నాడు. అందులో భాగంగానే ఆచార్య సినిమాను చాలా ఫాస్ట్ గా పూర్తి చేసి రిలీజ్ చేశాడు కానీ ఆ సినిమా రిజల్ట్ నిరాశ పరిచింది. తర్వాత తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాను అనౌన్స్ చేసి షూటింగ్ స్టార్ట్ చేశాడు.
అక్కడి వరకు బాగానే ఉంది. కానీ శంకర్ గేమ్ ఛేంజర్ తో పాటూ శంకర్ ఇండియన్2 సినిమాను కూడా చేయాల్సి రావడంతో గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ లేటవుతూ వస్తుంది. ఆ కారణంగానే అనుకున్న టైమ్ కు గేమ్ ఛేంజర్ షూటింగ్ జరగట్లేదు. శంకర్ తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తన 16వ సినిమాను చేయనున్న విషయం తెలిసిందే.
వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలుపెట్టాల్సింది. కానీ గేమ్ ఛేంజర్ వల్ల రామ్ చరణ్ ఈ సినిమాను కాస్త లేట్ గా స్టార్ట్ చేయనున్నాడు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ తన సినిమాలను ఫాస్ట్ గా ఫినిష్ చేయాలని చూస్తున్నాడట. అనుకున్న టైమ్ కు ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాలను కంప్లీట్ చేయాలని చరణ్ ఫిస్క్ అయ్యాడట.
గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్‌ను ఫిబ్రవరి నాటికి పూర్తి చేసి, ఏదైనా బ్యాలెన్స్ ఉంటే మార్చి లోపు మొత్తం కంప్లీట్ చేసి, తర్వాత బుచ్చిబాబు సినిమాకు పూర్తి స్థాయిలో డేట్స్‌ను కేటాయించాలని డిసైడయ్యాడట. అంతేకాదు, బుచ్చిబాబు సినిమాను ఏడాది టైమ్ లో కంప్లీట్ చేయాలని మరొక టార్గెట్ పెట్టుకున్నాడట చరణ్. మరి చరణ్ చేసుకున్న ఈ ప్లాన్స్ ఎంతవరకు వర్కవుట్ అవుతాయో చూడాలి.






