కమల్ కంటే ముందున్న చరణ్
రిలీజ్ లకు చాలా టైమ్ ఉన్నప్పటికీ పాన్ ఇండియాలకు సంబంధించిన బిజినెస్ డీల్స్ మాత్రం ఎంతో ముందుగానే పూర్తవుతున్నాయి. పుష్ప2 హిందీ రైట్స్ ను రూ.200 కోట్లకు కొన్నారన్న వార్త ఇప్పటికే నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఓటీటీ హక్కులను కూడా నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు కొనిందనే వార్తలొస్తున్నప్పటికీ ఇంకా క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు రామ్ చరణ్- శంకర్ కాంబోలో వస్తున్న గేమ్ ఛేంజర్ ఉత్తరాది థియేట్రికల్ హక్కులను రూ.75 కోట్లకు అమ్మినట్లు సమాచారం అందుతుంది.
కానీ ఇదే శంకర్ దర్శకత్వంలో కమల్ హీరోగా వస్తున్న ఇండియన్2 సినిమాకు మాత్రం అవే హక్కులు రూ.20 కోట్లే పలికిందట. రేటులో ఇంత తేడాకు కారణాలు లేకపోలేదు. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ కు నార్త్ లో బాగా క్రేజ్ పెరిగింది. దానికి తోడు ఆ సినిమా తర్వాత చరణ్ హీరోగా సోలోగా వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. దీంతో ఈ సినిమాకు డిమాండ్ బాగా పెరిగింది. పైగా జీ స్టూడియోస్ నిర్మాణ భాగస్వామ్యం వల్ల బిజినెస్ బాగా జరుగుతుంది.
ఇండియన్2కు లైకా లాంటి పెద్ద నిర్మాణ సంస్థ ఉన్నప్పటికీ కంటెంట్ పరంగా దానికి అనుకున్నంత బజ్ క్రియేట్ అవలేదు. దీన్ని బట్టి చూస్తుంటే గేమ్ ఛేంజర్, భారతీయుడు కంటే హైప్ విషయంలో ఎంత ముందుందో అర్థం చేసుకోవచ్చు. త్వరలోనే ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్లను శంకర్ డిసైడ్ చేయనున్నాడు. ఇండియన్2కు జూన్ 13 లేదా 14ని, గేమ్ ఛేంజర్ కోసం అక్టోబర్ లాస్ట్ వీక్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.