క్రేజీ కాంబోని సెట్ చేస్తున్న జక్కన్న
గుంటూరు కారం సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళితో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ పాన్ వరల్డ్ సినిమాకు సంబంధించిన పనులు లీక్స్ లేకుండా ఎంతో ఫాస్ట్ గా జరుగుతున్నాయి. త్వరలోనే కాస్ట్ అండ్ క్రూ తో భారీ వర్క్ షాప్ ప్లాన్ చేస్తున్నాడట రాజమౌళి. ఈ సినిమాలో కింగ్ నాగార్జున ఓ కీలక పాత్ర చేస్తున్నాడనే టాక్ చాలా బలంగా వినిపిస్తోంది.
ఇప్పటికే నాగ్ కు నెరేషన కూడా అయిపోయిందని, నాగ్ కూడా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. మహేష్ కు జోడీగా చెల్సియా ఇస్లాన్ ఇప్పటికే ఖరారైందని సమాచారం. నాగ్ కు జోడీగా దీపికా పదుకొణెను ఒప్పించడానికి ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ దీపికా ఓకే అంటే మాత్రం ఈ సినిమాకు క్రేజ్ మరింత పెరగడం ఖాయం.
ఇంకొన్నాళ్ల పాటూ ఆగితే కానీ ఈ విషయంలో క్లారిటీ వచ్చేలా లేదు. సినిమాను అనౌన్స్ చేయడానికి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టాలనేది ఇంకా ముహూర్తం ఫిక్స్ చేయలేదు. ఉగాదికి కానీ మరో నెల టైమ్ తీసుకుని ఏప్రిల్ లో కానీ అనౌన్స్ చేద్దామని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. సినిమాను 2026లో ఎట్టి పరిస్థితుల్లో అనౌన్స్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మరి అదెంత వరకు సాధ్యమవుతుందనేది పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.