రాహుల్ గాంధీకి ఏపీలో ఘన స్వాగతం

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి గన్నవరం ఎయిర్ పోర్ట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చిన రాహుల్ గాంధీ ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గిడుగురు రుద్రరాజు శాలువా కప్పి స్వాగతం పలికారు. సంతోషంగా కనిపించిన రాహుల్ ఏపీ నేతలను పలుకరించారు. విమానం దిగిన ఆయన వెంటన నడుచుకుంటూ వెళ్లి రన్‌వేపై ఉన్న ప్రత్యేక హెలికాప్టర్ ఎక్కి తెలంగాణ ఎన్నికల ప్రచారానికి బయలుదేరి వెళ్లారు. ఆయన వెంట జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉన్నారు. రాహుల్‌కు విమానాశ్రయంలో స్వాగతం పలికిన వారిలో మాజీ కేంద్ర మంత్రి జే.డి. శీలం, కార్యనిర్వాహక అధ్యక్షులు మస్తాన్ వలి, సుంకర పద్మశ్రీ ఉన్నారు.






