సద్గురు శ్రీ మధుసూధన్ సాయి చేతుల మీదుగా ‘క్వాలిటీ ఇంజినీరింగ్ ఫౌండేషన్’ వెబ్‌సైట్ లాంచ్
న్యూయార్క్‌లోని ప్రముఖ హోటల్‌లో ‘క్వాలిటీ ఇంజినీరింగ్ ఫౌండేషన్’ (క్యూఈఎఫ్) వెబ్‌సైట్ www.QEF.org లాంచ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఇంజినీరింగ్ విధానాల్లో సరికొత్త సాంకేతికను తీసుకురావడానికి తమ సంస్థ చేస్తున్న కృషిని క్యూఈఎఫ్ వ్యవస్థాపకులు వివరించారు. వివిధ రంగాల్లో ఉన్నత స్థాయి పదవులు నిర్వహిస్తున్న ఎందరో ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరిలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సద్గురు శ్రీ మధుసూధన్ సాయి కూడా ఉన్నారు. ఐక్యత, మానవసేవ గురించి ఎంతో ప్రచారం చేసే ఆయన చేతుల మీదుగానే క్యూఈఎఫ్ వెబ్‌సైటును లాంచ్ చేయడం జరిగింది. అనంతరం ఆయన్ను క్యూఈఎఫ్ సభ్యులు సన్మానించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన క్యూఈఎఫ్ వ్యవస్థాపకులు, ప్రెసిడెంట్ శ్రీ అట్లూరి.. ‘నాణ్యమైన ఇంజినీరింగ్ కమ్యూనిటీకి ఒక కేంద్రంగా మా వెబ్‌సైట్ మారుతుందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నా. దీని ద్వారా అందరూ తమ ఆలోచనలు పంచుకొని సరికొత్త, నాణ్యమైన టెక్నాలజీలకు బీజాలు వేయొచ్చు’ అని చెప్పారు.
శ్రీ మధుసూధన్ సాయి మాట్లాడుతూ.. ‘ఐకమత్యం, సానుభూతి, మెరుగైన ప్రపంచం కోసం కృషి చేయడం అనేవి క్యూఈఎఫ్‌లో కూడా మూల సిద్ధాంతాలు కావడం సంతోషకరం. అందరికీ మెరుగైన భవిష్యత్తు అందించడం కోసం క్యూఈఎఫ్ చేస్తున్న ఈ ప్రయాణంలో వారు విజయవంతం కావాలని ఆశీర్వదిస్తున్నా. నా మద్దతు వారికి ఎల్లప్పుడూ ఉంటుంది’ అని తెలియజేశారు.
వీరితోపాటు సెక్రటరీ సంతోష్ యామ్సాని, క్యూఈఎఫ్ కమిటీ సభ్యులు శరత్ వేట, కేదార్ ఫాడ్కే కూడా సంస్థ చేస్తున్న కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన సోమా రావుకు అందరూ అభినందనలు తెలియజేశారు. అలాగే మెరుగైన ప్రపంచం కోసం సాంకేతిక రంగంలో వినూత్నమైన ఆలోచనలు చేయడం చాలా అవసరమని, దానికి ఇదే సరైన తరుణమని చెప్పుకొచ్చారు.