ASBL Koncept Ambience
facebook whatsapp X

ప్రధాని మోదీ సంస్కారానికి ఇది నిదర్శనం : సురభి వాణీదేవి

ప్రధాని మోదీ సంస్కారానికి ఇది నిదర్శనం : సురభి వాణీదేవి

దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించడంపై ఆయన కుమార్తె, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ సురభి వాణీదేవి ఆనందం వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆమె మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా పీవీ సేవలను గుర్తించారని, ప్రధాని నరేంద్ర మోదీ సంస్కారానికి ఇది నిదర్శనమని కొనియాడారు.  పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వడంతో ఆ పురస్కారం విలువ పెరిగింది. ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టేనాటికి దేశం ప్రమాదపు అంచుల్లో ఉండేది. సమస్యలకు శాశ్వత పరిష్కారం ఉండేలా ఆయన ఆలోచించారు. ఎలాంటి భయం, మొహమాటం లేకుండా ప్రజాక్షేమమే ప్రథమ ప్రాధాన్యంగా జీవించారు. తరతరాలకూ సరిపోయేలా సంస్కరణలను తీసుకొచ్చారు. దేశానికి అత్యున్నత పురస్కారం పీవీకి దక్కడంపై తెలంగాణ ప్రజలు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2021లో శతజయంతి ఉత్సవాలను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. దీంతో దేశానికి ఆయన చేసిన కృషి మరింత మందికి చేరువైంది. పీవీ నరసింహారావును గౌరవించుకోవడమంటే మనల్ని మనం గౌరవించుకోవడమే అని అన్నారు.

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :