ASBL NSL Infratech

పొంగులేటికి మంత్రి పువ్వాడ సవాల్.. దమ్ముంటే బీఆర్ఎస్ కు

పొంగులేటికి మంత్రి పువ్వాడ సవాల్.. దమ్ముంటే బీఆర్ఎస్ కు

దమ్ముంటే తనను బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలన్న పోంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ఘాటుగా స్పందించారు. ఖమ్మం జిల్లా వైరాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డికి దమ్ముంటే బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయాలి అని సవాల్‌ విసిరారు.  బీఆర్‌ఎస్‌ పార్టీ బీ ఫామ్‌ ద్వారా గెలిచి పొంగులేటికి వంత పాడుతున్న నేతలంతా తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే పార్టీ క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌లో ఉన్న వారంతా కేసీఆర్‌కు విధేయులే. నా బ్రాండ్‌ నా గ్రూప్‌ అంటే కుదరదు అని తేల్చి చెప్పారు.  టీఆర్‌ఎస్‌ పార్టీ, కేసీఆర్‌.. పొంగులేటి లాంటి వ్యక్తులకు రాష్ట్రంలో ఎంతో మందిని చూశారు.  పార్టీ శాసనసభా పక్షాన్ని 2009లో చీల్చే ప్రయత్నం చేసినప్పుడే కేసీఆర్‌ చలించలేదు అని గుర్తు చేశారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :