ASBL Koncept Ambience
facebook whatsapp X

పుష్ప రిలీజ్ డేట్ టార్గెట్ క‌ష్టంగానే ఉందే!

పుష్ప రిలీజ్ డేట్ టార్గెట్ క‌ష్టంగానే ఉందే!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేష‌న్ లో వ‌స్తున్న పుష్ప‌2 షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ సినిమా కోసం పుష్ప‌2 టీమ్ మొత్తం రాత్ర‌న‌క ప‌గ‌ల‌న‌క క‌ష్ట‌ప‌డుతున్నారు. రీసెంట్ గా ఈ సినిమాకు కొన్ని ఎపిసోడ్స్ ను రీ షూట్ చేసిన విష‌యం తెలిసిందే. ఎలాగైనా పుష్ప‌2 తో రూ.1000 కోట్ల మార్క్ ను టచ్ చేయాల‌ని బ‌న్నీ ఎంతో క‌సిగా ఉన్నాడు.

మ‌రోవైపు నిర్మాత‌లు కూడా ఈ సినిమా బ‌డ్జెట్ విష‌యంలో కాంప్ర‌మైజ్ కాకుండా ఖ‌ర్చు పెడుతున్నారు. రీసెంట్ గానే పుష్ప‌2 కోసం ఫ‌హ‌ద్ ఫాజిల్ డేట్స్ ఇవ్వ‌డంతో ప్ర‌స్తుతం ఆయ‌న‌కు సంబంధించిన స‌న్నివేశాల‌ను షూట్ చేస్తున్నారు. రీసెంట్ గా పుష్ప‌2 నుంచి ఎడిట‌ర్ కార్తీక్ శ్రీనివాస్ త‌ప్పుకోవ‌డంతో న‌వీన్ నూలి టీమ్ ఆ ఎడిటింగ్ బాధ్య‌త‌ల‌ను చేపట్టింది.

ఇదిలా ఉంటే ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన వీఎఫ్ఎక్స్ వ‌ర్క్స్ తో సుకుమార్ అసంతృప్తిగా ఉండ‌టంతో వాటిని పూర్తి చేయ‌డానికే ఎక్కువ టైమ్ ప‌డుతుంద‌ట‌. దీంతో షూటింగ్ కు మ‌రింత లేట్ అవుతుంద‌నే వార్త‌లు గ‌ట్టిగా వినిపిస్తున్నాయి. టీమ్ చెప్తున్న ప్ర‌కార‌మైతే పుష్ప‌2 షూటింగ్ జులై చివ‌రి వ‌ర‌కు ఉండ‌నుంది. ఇలాంటి సిట్యుయేష‌న్స్ లో టీమ్ చెప్పిన ఆగ‌స్ట్ 15 అనే రిలీజ్ డేట్ ను అందుకోవ‌డం సుకుమార్ కు సాధ్య‌మ‌వుతుందా అనే టాక్ వినిపిస్తుంది. అటు బ‌న్నీ, ఇటు సుకుమార్ అంద‌రూ రిలీజ్ డేట్ ను అందుకోవాల‌ని ఎంతో క‌ష్ట‌ప‌డుతున్నారు. కానీ ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో అది క‌ష్ట‌మ‌ని అంటున్నారు. ఒక‌వేళ పుష్ప‌2 ఆ డేట్ ను వ‌దిలేసుకుంటే ఆ డేట్ లో ఏయే సినిమాలొస్తాయో?  త‌ర్వాత పుష్ప‌2 కోసం ఏ డేట్ ను ఫిక్స్ చేసుకుంటారో చూడాలి.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :