ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

‘ఈగల్’ క్లాసిక్ స్టయిలీష్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ : నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్

‘ఈగల్’ క్లాసిక్ స్టయిలీష్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ : నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఫిబ్రవరి 9న ఈగల్ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ 'ఈగల్' విశేషాలని విలేకరుల సమావేశంలో పంచుకున్నారు.

'ధమాకా' తర్వాత రవితేజ గారితో సినిమా చేస్తున్నపుడు సహజంగానే అంచనాలు వుంటాయి కదా.. ఈగల్ ఎలా ఉండబోతుంది?

-'ధమాకా' మాస్ ఎంటర్ టైనర్ ఐతే.. ‘ఈగల్’ చాలా క్లాసిక్ స్టయిలీష్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్. ఇందులో ఎంటర్ టైన్మెంట్ భేస్ మాస్ వుంది. ఈగల్ కంటెంట్ అద్భుతంగా వుంటుంది. ఆడియన్స్ ని అలరించే చాలా మంచి ఎలిమెంట్స్ వున్నాయి. ఖచ్చితంగా ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు. రవితేజ గారు సరికొత్తగా కనిపించబోతున్నారు. కథ, మెసేజ్, యాక్షన్, సాంగ్స్ అన్నీ ఎక్స్ ట్రార్డినరీ వుంటాయి.

రవితేజ గారితోనే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడానికి కారణం ?

-రవితేజ గారితో మాకు ఎక్స్ ట్రార్డినరీ రిలేషన్ షిప్ వుంది. ఆ రిలేషన్ షిప్ తోనే ఆయనతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాం.

దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని గురించి ?

-కార్తీక్ ఘట్టమనేని గారితో ఎప్పటినుంచో మా అనుబంధం వుంది. ధమాకా జరుగుతున్న సమయంలోనే ఈ ప్రాజెక్ట్ ప్లాన్ చేశాం. 'ఈగల్' ని అద్భుతంగా తీశారు. మా నిర్మాణంలో మరో సినిమా చేస్తున్నాం. త్వరలోనే అనౌన్స్ చేస్తాం.

ఈగల్ ని జనవరి13 చేయాలనుకున్నారు.. ఇప్పుడు ఫిబ్రవరిలో 9న వస్తున్నారు..ట్రేడ్ లో క్రేజ్ పెరిగిందని భావిస్తున్నారా?

-పరిశ్రమ మేలుని ద్రుష్టిలో పెట్టుకొని ఆ నిర్ణయం తీసుకున్నాం. ట్రేడ్ విషయానికి వస్తే అప్పుడు మేము సెకండ్ బెస్ట్.. ఇప్పుడు నెంబర్ వన్. మిగతా చిత్రాలు వేటి రీచ్ వాటికి వున్నాయి.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి ఈ ఏడాది ఎన్ని సినిమాలు విడుదల కావచ్చు ?

-మినిమం 15 సినిమాలు విడుదలౌతాయి. ఇవి పోస్ట్ ప్రొడక్షన్ లో వున్నాయి. ప్రొడక్షన్ లో దాదాపు 6 చిత్రాలు వున్నాయి. ఇవి కాకుండా ఈటీవీవిన్ కోసం కొన్ని చిత్రాలు నిర్మాణం అవుతున్నాయి. అలాగే దాదాపు నాలుగు సినిమాలు అమెరికాలో చేస్తున్నాం. ప్రతి నెల మా నుంచి ఒక చిత్రం విడుదల కానుంది. ఈ ఏడాది 50 చిత్రాల మైలు రాయిని అందుకుంటామని భావిస్తున్నాం.

ప్రభాస్ గారి రాజాసాబ్ ఎప్పుడు ?

-తర్వలోనే తెలియజేస్తాం.

ఓటీటీ ఫ్లాట్ ఫామ్ చేసే ఆలోచన ఉందా ?

-మేము ఓటీటీ ఫ్లాట్ ఫామ్ చేయడం వుండదు. కానీ మేము ఓటీటీ లో బిగ్గర్ రోల్ ప్లే చేస్తాం.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :