గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ కు ప్రెసిడెంట్ అవార్డు
గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్‌కు ప్రెసిడెన్షియల్ వాలంటీర్ సర్వీస్ అవార్డు (పివిఎస్‌ఎ) లభించిందని అసోసియేషన్ చైర్మన్ విశ్వేశ్వర్ రెడ్డి కలవల తెలిపారు. సర్టిఫైడ్ ఆర్గనైజేషన్ గుర్తింపు లభించిందని, ఇది మా సేవకు లభించిన గుర్తింపుగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ అవార్డు మాపై మరింత బాధ్యతలను పెంచిందని, మరింత నిబద్దతతో, అంకితభావంతో కమ్యూనిటీ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని ఆయన చెప్పారు. గ్లోబల్‌గా తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడటంతోపాటు, తెలంగాణలోని ప్రజలకు, అమెరికాలోని తెలంగాణవాసులకు అన్నీ విధాలుగా సేవలను సహాయాన్ని అందిస్తున్నట్లు విశ్వేశ్వర్ రెడ్డి కలవల చెప్పారు.
Tags :