ఆ డైరెక్టర్ల ప్లానింగే వేరులే
ఈ మధ్య టాలీవుడ్ లో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా ప్రతీ సినిమా చాలా టైమ్ తీసుకుని మరీ తెరకెక్కుతుంది. పూరీ ఒక్కడే ఈ లిస్ట్ లోకి రాడు. మిగిలిన డైరెక్టర్లంతా నెమ్మదిగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆ విధానం ఇంకా మారింది. బడ్జెట్, హీరోల కండిషన్స్, రెమ్యూనరేషన్స్ ఇలా ఎన్నో కారణాలతో సినిమాలు మాత్రం లేట్ అవుతున్నాయి.
కానీ ఇద్దరు యంగ్ డైరెక్టర్లు మాత్రం దీనికి మినహాయింపుగా కనిపిస్తున్నారు. అందులో మొదటిది గౌతమ్ తిన్ననూరి. గౌతమ్, విజయ్ కాంబినేషన్ లో ఓ సినిమా ఇప్పటికే అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ స్టార్ ను త్వరగా పూర్తి చేయాలన్న కారణంతో విజయ్ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను పెండింగ్ పెట్టాడు.
ఫిబ్రవరి వరకు గౌతమ్- విజయ్ సినిమా మొదలయ్యే ఛాన్స్ లేకపోవడంతో ఈ గ్యాప్ లో తక్కువ బడ్జెట్ తో ఓ రొమాంటిక్ లవ్ స్టోరీని తీశాడట గౌతమ్. ఈ సినిమాకు మ్యూజిక్ చాలా కీలకం కావడంతో అనిరుధ్ తో దగ్గరుండి మరీ మ్యూజిక్ ను కంపోజ్ చేయించుకున్నాడట గౌతమ్. ఇక రెండో డైరెక్టర్ హనుమాన్. తేజ సజ్జతో చేసిన హనుమాన్ మూవీ ఎప్పుడో ఫినిష్ అవడంతో, ఈ సినిమా రిలీజ్ లోపు మరో సినిమాను తక్కువ బడ్జెట్ లో ఫినిష్ చేశాడని టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ రెండు సినిమాలకు సంబంధించిన వివరాలేవీ బయటకు రాలేదు కానీ త్వరలోనే మంచి టైమ్ చూసుకుని ఈ సినిమాలను ఆయా మేకర్స్ అనౌన్స్ చేయనున్నారట. ఏదేమైనా టైమ్ వేస్ట్ చేయకుండా ఈ యంగ్ డైరెక్టర్లు తమ కెరీర్లను ప్లాన్ చేసుకున్న విధానానికి అందరూ ఆశ్చర్యపోతున్నారు.