సలార్ రిలీజ్ కు మరో కొత్త డేట్

ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసిన సలార్ సినిమా ఈ ఏడాది రిలీజ్ దాదాపు లేనట్టే అనుకోవాలి. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ తమ డిస్ట్రిబ్యూటర్లకు ఇప్పటికే చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. నవంబర్ లేదా డిసెంబర్ లో సలార్ ను రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ సోలో రిలీజ్ దక్కే ఛాన్స్ లేకపోవంతో ఈ సినిమాను వచ్చే సంవత్సరానికి షిఫ్ట్ చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
నెక్ట్స్ ఇయర్ రిలీజ్ అయినప్పటికీ సంక్రాంతి రేసులో సినిమాను రిలీజ్ చేయాలనుకోవడం లేదట మేకర్స్. సలార్ సినిమాను మార్చి 22న రిలీజ్ చేసే దిశగా ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సమ్మర్ హాలిడేస్ కు ముందు రిలీజ్ చేసి, ఎగ్జామ్స్ అయ్యే వరకు సినిమా నిలబడితే ఇక బాక్సాఫీస్ షేక్ అవడం ఖాయమని అందుకే ఈ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
సినిమా ఒక్క తెలుగులోనే కాదు కాబట్టి మిగిలిన అన్ని భాషల్లో కూడా ఎలాంటి క్లాష్ కాకుండా చూసుకుని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అక్టోబర్ లో ప్రభాస్ బర్త్‌డే కు స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేయాలని చూస్తున్నారట. అప్పటి వరకు వెయిట్ చేస్తే రిలీజ్ డేట్ విషయంలో ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది. అప్పటివరకు వెయిట్ చేయడం తప్ప చేయగలిగిందేమీ లేదు.






