ASBL NSL Infratech

యాక్ష‌న్ ప్యాక్డ్ విజువ‌ల్ వండ‌ర్‌గా స్పిరిట్?

యాక్ష‌న్ ప్యాక్డ్ విజువ‌ల్ వండ‌ర్‌గా స్పిరిట్?

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమ‌ల్ సినిమాల‌తో హ్యాట్రిక్ స‌క్సెస్ అందుకున్న సందీప్ రెడ్డి వంగా త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు ఫ్లాప్ లేని డైరెక్ట‌ర్ గా రాజ‌మౌళికి గుర్తింపు ఉంది. ఆ త‌ర్వాత రికార్డు సందీప్ కే ఉంది. యానిమ‌ల్ సినిమాతో త‌న క్రేజ్ ను మరింత పెంచుకున్నాడు సందీప్. సందీప్ రెడ్డి వంగా త‌న త‌ర్వాతి సినిమాను పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ తో చేయ‌నున్న విష‌యం తెలిసిందే. స్పిరిట్ అనే టైటిల్ తో తెర‌కెక్క‌నున్న ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ స్క్రిప్ట్ ను సందీప్ ఇప్పుడు డెవ‌ల‌ప్ చేస్తున్నాడు. ప్ర‌స్తుతం డైలాగ్ వెర్ష‌న్ జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తోంది. డిసెంబ‌ర్ నుంచి ఈ సినిమా షూటింగ్ కు వెళ్ల‌నుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్ర‌భాస్ మునుపెన్న‌డూ చూడ‌ని విధంగా స‌రికొత్త‌గా క‌నిపించ‌నున్న‌ట్లు స‌మాచారం. నిజాయితీ క‌లిగిన పోలీసాఫీస‌ర్ గా ప్ర‌భాస్ ను సందీప్ ఈ సినిమాలో చూపించ‌బోతున్నాడు. స్పిరిట్ లో ప్ర‌భాస్ క్యారెక్ట‌ర్ ఎంతో ఎమోష‌న్ తో డెప్త్ తో నిండి ఉంటుంద‌ని తెలుస్తోంది. స్పిరిట్ ను యాక్ష‌న్ ప్యాక్డ్ విజువ‌ల్ వండ‌ర్ గా తీర్చిదిద్దాల‌ని సందీప్ అనుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌నున్నాయి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :