ప్రభాస్ మారుతి మూవీ రెండు పార్ట్స్ కాదట..

బాహుబలి సినిమా పుణ్యమా అని రెండు భాగాల సినిమాలపై జనాలకు బాగా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. ఇలా చేయడం వల్ల ఎంటర్టైన్మెంట్ కు ఎంటర్టైన్మెంట్, ఆదాయానికి ఆదాయం. మొదట్లో బాహుబలిని ఒక్క సినిమానే అనుకున్నారు కానీ తర్వాత అది రెండు భాగాలై, ఆ తర్వాత మంచి సక్సెస్ ను అందుకుంది. తర్వాత పుష్ప, కెజిఎఫ్ కూడా ఇదే తరహాలో వచ్చి మంచి హిట్లుగా నిలిచాయి.
అయితే రెండు భాగాలున్న ప్రతి సినిమా హిట్ అవుతుందనేమీ లేదు. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు ఇలానే రెండు భాగాలుగా చేసి ఘోర పరాజయాన్ని పొందారు. రీసెంట్ గా కన్నడలో కబ్జ అనే సినిమా పరిస్థితి కూడా ఇంతే. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో చేస్తున్న సినిమా కూడా రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నారనే వార్త హాట్ టాపిక్ గా మారింది.
ఇప్పటికే సలార్ రెండు భాగాలుగా రానుందన్న విషయాన్ని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు మారుతి సినిమా కూడా రెండు పార్టులుగా అంటే ఫ్యాన్స్ నుంచి ఘోరమైన వ్యతిరేకత వచ్చింది. అసలు ఫాం లో లేని మారుతితో ప్రభాస్ సినిమా చేయడమే ఫ్యాన్స్ జీర్ణించుకోలేని అంశం. మారుతితో సినిమా అని వార్తలొచ్చినప్పుడు ఆయనతో సినిమా చేయొద్దని ఫ్యాన్స్ నానా రచ్చ చేశారు కానీ ప్రభాస్ అవేమీ పట్టించుకోకుండా మారుతితో సెట్స్ పైకి వెళ్లాడు.
అయితే మారుతి సినిమా రెండు భాగాలుగా రానుందన్న విషయం ఎక్కడ మొదలైందో కానీ ఇది అసలు నిజం కాదని చిత్ర యూనిట్ చెప్తోంది. ఇప్పటికైతే ఈ సినిమాను ఒకటే సినిమాగా చేస్తున్నట్లు, సెకండ్ పార్ట్ కోసం జస్ట్ హింట్ ఇచ్చి వదిలేసి, సినిమా రిజల్ట్, ప్రభాస్ డేట్స్ ను బట్టి ఆ విషయం గురించి ఆలోచించేలా మారుతి ప్లాన్ చేసుకున్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం.






