ASBL Koncept Ambience
facebook whatsapp X

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై అధికారుల ఫిర్యాదు.. కేసు నమోదు

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై అధికారుల ఫిర్యాదు.. కేసు నమోదు

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి అనుకోని షాక్ తగిలింది. ఒకపక్క పోలింగ్ జోరుగా కొనసాగుతున్న టైంలో ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదైంది. మంగళ్ హాట్ పరిధిలోని ఎస్ఎస్‌కే జూనియర్ కళాశాల పోలింగ్‌బూత్‌లో ఎమ్మెల్యే రాజాసింగ్ సోమవారం నాడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఓటు వేసేందుకు పోలింగ్ బూత్‌లోకి వెళ్లిన ఆయన.. పోలింగ్ అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మంగళ్ హాట్ పోలీసులకు ఎన్నికల స్క్వాడ్ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుతో పోలీసులు రాజాసింగ్‌పై కేసు నమోదు చేశారు.

ఇదిలా ఉంటే హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్ధి మాధవీలతపై కూడా ఎన్నికల అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని పాతబస్తీ సెగ్మెంట్‌లో భాగమైన ఓ పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ సరళిని పరిశీలించేందుకు వెళ్లిన మాధవీలత.. అక్కడ ఓటు వేయడానికి బుర్ఖా లో వచ్చిన ముస్లిం సామాజిక వర్గానికి చెందిన మహిళల ఓటర్ స్లిప్‌లను పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే వారి బుర్ఖాలను తొలగించి ఓటరు స్లిప్‌లతో పోల్చి చూశారు. ఈ చర్యపై ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ ఆదేశాలతో మాధవీలతపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

 

 

praneet praneet praneet ASBL Landmark Radhey Skye Radha Spaces
Tags :