ASBL Koncept Ambience
facebook whatsapp X

ప్రపంచంలోనే తొలి వేద గడియారం

ప్రపంచంలోనే తొలి వేద గడియారం

ప్రపంచంలో తొలి వేద గడియారాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మార్చి 1న వర్చువల్‌ విధానంలో ఆవిష్కరిస్తారు. భారతీయ సంప్రదాయం పంచాంగం ప్రకారం ఇది సమయాన్ని చూపిస్తుంది. దీనిని మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని నగరం, జంతర్‌ మంతర్‌ వద్ద 85 అడుగుల ఎత్తయిన టవర్‌పై ఏర్పాటు చేశారు. ప్రభుత్వ జివాజీ అబ్జర్వేటరీ సమీపంలో ఇది ఉంది. వైదిక పంచాంగం, గ్రహాల స్థితిగతులు, ముహూర్తాలు, జ్యోతిష సూచనలు వంటివాటిని ఈ గడియారం ప్రదర్శిస్తుంది. అంతేకాకుండా భారత కాలమానం (ఐఎస్‌టీ), గ్రీన్‌విచ్‌ మీన్‌ టైమ్‌ (జీఎంటీ)ల ప్రకారం కూడా సమయాన్ని చూపిస్తుంది.

 

 

praneet praneet praneet ASBL Landmark Radhey Skye Radha Spaces
Tags :