ASBL NSL Infratech

మోడీ తమిళనాడు టూర్ ఖరారు..

మోడీ తమిళనాడు టూర్ ఖరారు..

గురువారంతో సార్వత్రిక ఎన్నికల కోలాహలం ముగియనుంది. జూన్ 1వ తేదీన ఏడో విడత పోలింగ్ జరుగనుంది. ఇదే చివరిది. ఇప్పటివరకు ఆరుదశల్లో పోలింగ్ ముగిసింది. ఏపీ అసెంబ్లీ వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది.చివరి విడతలో మొత్తం ఎనిమిది రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో 57 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. బిహార్- 8, చండీగఢ్- 1, హిమాచల్ ప్రదేశ్- 4, జార్ఖండ్- 3, ఒడిశా- 6, పంజాబ్- 13, ఉత్తరప్రదేశ్- 13, పశ్చిమ బెంగాల్- 9 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా మొత్తం 598 మంది అభ్యర్థులు చివరి దశ పోలింగ్ బరిలో ఉన్నారు.ఉత్తరప్రదేశ్‌లోని వారణాశి నియోజకవర్గానికీ అదే రోజున పోలింగ్ ఉంటుంది. చివరి దశలో కూడా పైచేయిసాధించడానికి ఎన్డీఏ, ఇండియా కూటమి నాయకులు విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటోన్నారు. ముమ్మరంగా ప్రచారం సాగిస్తోన్నారు. దీంతో దేశంలో మొత్తం ఏడు విడతల్లో 543 లోక్‌సభ నియోజకవర్గాలకుపోలింగ్ ముగిసినట్టవుతుంది. 4వ తేదీన ఫలితాలు వెలువడుతాయి.

కన్యాకుమారికి మోడీ..

ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే మోడీ.. తమిళనాడు పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. 30వ తేదీన సాయంత్రం ఆయన కన్యాకుమారికి చేరుకుంటారు. మూడు రోజుల పాటు అంటే జూన్ 1వ తేదీ వరకు అక్కడే గడుపుతారు. కన్యాకుమారిలోని రాక్ మెమోరియల్‌ను సందర్శిస్తారు. స్వామి వివేకానంద ధ్యానం చేసిన అదే స్థలంలో నిర్మించిన ధ్యాన మండపంలో మెడిటేషన్‌లో పాల్గొంటారు మోడీ. 24 గంటల పాటు ఈ ధ్యానం కొనసాగుతుంది. మే 30 సాయంత్రం నుంచి జూన్ 1వ తేదీ సాయంత్రం వివేకానంద రాక్ మెమొరియల్‌లో ధ్యానంలో గడుపుతారు మోడీ.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :