ASBL Koncept Ambience
facebook whatsapp X

ఎన్టీఆర్ ఎంతో దార్శనికత గల నాయకుడు : మోదీ

ఎన్టీఆర్ ఎంతో దార్శనికత గల నాయకుడు : మోదీ

దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‍ ఎంతో దార్శనికత గల నాయకుడని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఎన్టీఆర్‍ 101వ జయంతి సందర్భంగా ప్రధాని స్మరించుకున్నారు. ఎన్టీఆర్‍ జయంతి సందర్భంగా ఆ మహనీయుణ్ణి స్మరించుకుంటున్నాం. తెలుగు సినీ రంగంలో విశిష్ట నటుడైన ఆయన ఎంతో దార్శనికత గల నాయకుడు. సినీ, రాజకీయ రంగాలకు ఎన్టీఆర్‍ చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. తెరపై ధరించిన పాత్రలను, ఆయన నాయకత్వ పటిమను ప్రజలు ఇప్పటికీ తలచుకుంటారు. ఎన్టీఆర్‍ కలలుగన్న సమాజం కోసం మేము నిరంతరం పని చేస్తాం అని మోదీ పేర్కొన్నారు.

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :