మత్స్య సమాఖ్య చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన పిట్టల రవీందర్

మత్స్య సమాఖ్య చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన పిట్టల రవీందర్

తెలంగాణ రాష్ట్ర మత్స్య, సహకార సంఘాల సమాఖ్య చైర్మన్‌గా పిట్టల రవీందర్‌ బాధ్యతలు స్వీకరించారు. మాసబ్‌ట్యాంక్‌లోని మత్స్య శాఖ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పాల్గొని రవీందర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను మంత్రి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ బండా ప్రకాశ్‌ ముదిరాజ్‌, ఆయా కార్పొరేషన్ల చైర్మన్లు దూదిమెట్ట బాలరాజు యాదవ్‌, గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌, దామోదర్‌ గుప్తా తదితరులు పాల్గొన్నారు.  తెలంగాణ ఉద్యమకారుడు, మత్స్యరంగ నిపుణుడు, జర్నలిస్ట్‌ పిట్టల రవీందర్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సహకార సంఘాల సమాఖ్య చైర్మన్‌గా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియమించిన సంగతి తెలిసిందే.

 

 

praneet obili-garuda AHA poulomi Png-jewelry aurobindo MUPPA
Tags :