ASBL NSL Infratech

అసలు, సిసలైన హారర్ అనుభూతిని కలిగించే ‘పిండం‘,  డిసెంబర్ 15న విడుదల

అసలు, సిసలైన హారర్ అనుభూతిని కలిగించే  ‘పిండం‘,  డిసెంబర్ 15న విడుదల

*సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న 'పిండం'
*‘పిండం' చిత్రం చూసి థ్రిల్ అయిన సెన్సార్ సభ్యులు
*డిసెంబర్ 7 వైవిధ్య భరితంగా చిత్రం ప్రీ రిలీజ్ వేడుక

హారర్ జానర్ చిత్రాల పట్ల ప్రేక్షకుల్లో ఎప్పుడూ మంచి ఆసక్తి ఉంటుంది. అయితే మన దగ్గర పూర్తిస్థాయి హారర్ చిత్రాలు రావడం చాలా అరుదు. కొన్ని చిత్రాలలో రొమాంటిక్ లేదా కామెడీ ట్రాక్ ల వల్ల హారర్ మోతాదు తగ్గిపోతుంది. అలాంటి ట్రాక్ ల జోలికి పోకుండా, కేవలం ప్రేక్షకులను భయపెట్టడమే లక్ష్యంగా తెలుగులో అసలుసిసలైన హారర్ చిత్రం రాబోతోంది.

ప్రముఖ హీరో  శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం 'పిండం'. 'ది స్కేరియస్ట్ ఫిల్మ్' అనేది ఉప శీర్షిక. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులకు అసలైన హారర్ అనుభూతిని అందించడానికి రాబోతుంది.

సెన్సార్ పూర్తి, అభినందనలు అందుకున్న చిత్ర బృందం

తాజాగా 'పిండం' సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ మూవీని చూసి థ్రిల్ అయ్యారు. ఈ మధ్య కాలంలో ఈస్థాయిలో భయపెట్టిన హారర్ చిత్రాన్ని చూడలేదని అభిప్రాయపడ్డారు. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు, తర్వాత ఏం జరుగుతుందన్న ఉత్కంఠను రేకెత్తిస్తూ అద్భుతంగా రూపొందించారని చిత్ర బృందాన్ని ప్రశంసించారు.

డిసెంబర్ 7 ప్రీ రిలీజ్ వేడుక:

హైదరాబాద్ లో డిసెంబర్ 7వ తేదీన సాయంత్రం 'పిండం' ప్రీ రిలీజ్ వేడుక అత్యంత వైభవంగా జరగనుంది. ఈ వేడుకకు చిత్ర బృందంతో పాటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరు కాబోతున్నారు. ఈ వేడుకను ఆద్యంతం ఆసక్తికరంగా, విభిన్న రీతిలో, సినిమా కు తగినట్లుగా సరికొత్త అనుభూతిని కలిగించేలా ప్లానింగ్ చేస్తున్నారు చిత్ర బృందం.

డిసెంబర్ 15 సినిమా విడుదల:

హారర్ జానర్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'పిండం' చిత్ర విడుదల తేదీని తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాని డిసెంబర్ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల చేయబోతున్నట్లు తెలిపారు.

ప్రేక్షకులను భయపెట్టడమే లక్ష్యంగా 'పిండం' అనేది ఓ కంప్లీట్ హారర్ చిత్రంగా రూపొందింది. ఇంతటి భయానక హారర్ చిత్రాన్ని టాలీవుడ్ ఇంతవరకూ చూడలేదని, ఒంటరిగా కూర్చొని ఈ సినిమాని చూడలేరని చిత్ర బృందం చెబుతోంది. స్క్రీన్‌ప్లే ఈ చిత్రానికి హైలైట్‌గా నిలవనుంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :