ASBL NSL Infratech

ప‌క్కా ప్లానింగ్ తో ముందుకెళ్ల‌నున్న ప‌వ‌న్

ప‌క్కా ప్లానింగ్ తో ముందుకెళ్ల‌నున్న ప‌వ‌న్

గ‌త వారం రోజులుగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న ఫ్యాన్స్ కు ఇస్తున్న హై మామూలుగా లేదు. ఏ ఫ్యాన్స్ అయినా వ‌న్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ అలాంటి హై ను ఎక్స్‌పీరియ‌న్స్ చేయాలి. ప‌వ‌న్ పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచాక చిరంజీవి ఇంటికి వెళ్ల‌డం, మోదీతో తానొక తుఫాన‌ని అనిపించుకోవ‌డం, ఢిల్లీలో ముఖేష్ అంబానీ ద‌గ్గ‌రికొచ్చి మ‌రీ హ‌గ్ చేసుకోవ‌డం ఇవ‌న్నీ ప‌వ‌న్ ఫ్యాన్స్ కు ఊపిరాడ‌నీయ‌నంత సంతోషాన్నిస్తున్నాయి.

దీంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ ఆయ‌న న‌టించే సినిమాల గురించి సైతం మ‌ర్చిపోయారు. ప‌వ‌న్ అర్జెంటుగా త‌ను ఇప్ప‌టికే క‌మిట్ అయిన హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు, ఓజి, ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ సినిమాల‌ను పూర్తి చేయాల్సి ఉంది. కానీ ప‌వ‌న్ ఇప్పుడే గెలిచి ప‌ద‌వీ బాధ్య‌త‌లు తీసుకునే బిజీలో ఉన్నాడు. ఇలాంటి టైమ్ లో ప‌వ‌న్ ఇప్ప‌టిక‌ప్పుడు షూటింగ్స్ కు హాజ‌ర‌వుతాడా అని అందరూ అనుకుంటున్నారు.

అయితే ఈ విష‌యంలో ప‌వ‌న్ చాలా క్లారిటీ గా ఉన్నాడ‌ని తెలుస్తోంది. ముందుగా ప‌వ‌న్ వీర‌మ‌ల్లును పూర్తి చేయాలి కాబ‌ట్టే దానికోస‌మే జుట్టు పెంచుతున్నాడ‌ని ఆయ‌న స‌న్నిహితులంటున్నారు. ఆ సినిమా పూర్తి చేయ‌గానే ఓజి కోసం తిరిగి రెగ్యుల‌ర్ స్టైల్ లోకి ప‌వ‌న్ రానున్నాడ‌ట‌. ఓ వైపు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు జ‌నాల కోసం, జ‌న‌సేన కోసం కేటాయించ‌నున్నాడ‌ట ప‌వ‌న్. ప్ర‌భుత్వ‌ జీతం తీసుకుని ప్ర‌జ‌ల‌కు జ‌వాబుదారిగా ఉంటాన‌ని చెప్పాడు కాబ‌ట్టి అన్నీ దానిక‌నుగుణంగానే ప‌వ‌న్ ప్లాన్ చేసుకుంటున్నాడ‌ట‌. దీన్ని బ‌ట్టి చూస్తే ప‌వ‌న్ సినిమాల రిలీజ్ డేట్స్ చెప్పిన టైమ్ కు రావ‌డం అయితే డౌటే.  

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :