సీఎం రేవంత్ తో పట్నం మహేందర్ రెడ్డి దంపతుల భేటీ
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఆయన సతీమణి, వికారాబాద్ జడ్పీ చైర్‌పర్సన్ సునీతారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. రేవంత్‌కు పట్నం దంపతులు శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేశారు. మహేందర్ రెడ్డితో పాటు తాను, తమ అనుచరవర్గం వారం రోజుల్లో కాంగ్రెస్‌లో చేరతామని సునీతారెడ్డి తెలిపారు. ఢిల్లీ లేదా హైదరాబాద్ వేదికగా పార్టీలో చేరాలా, జిల్లాలో బహిరంగ సభ నిర్వహించి చేరాలా అనే విషయమై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్‌లో చేరడం మాత్రం ఖాయమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మంత్రి దామోదర్ రాజనర్సింహా, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి కుమారుడు రినీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags :