ASBL NSL Infratech

నైటా మహాశివరాత్రి వేడుకలు విజయవంతం... ఆకట్టుకున్న పేరిణి నాట్య వైభవం

నైటా మహాశివరాత్రి వేడుకలు విజయవంతం... ఆకట్టుకున్న పేరిణి నాట్య వైభవం

న్యూయార్క్‌ తెలంగాణ తెలుగు సంఘం మహాశివరాత్రి మరియు మహిళా దినోత్సవ వేడుకలు న్యూయార్క్‌ నగరం నడిబొడ్డున గణేష్‌ టెంపుల్‌ ఆడిటోరియంలో నైటా ప్రెసిడెంట్‌ వాణి సింగిరికొండ ఆధ్వర్యంలో ఘనంగా  వైభవోపేతంగా జరిగినవి. దాదాపు 500 లకు పై చిలుకు ఆహ్వానితులు హాజరైన ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పేరిని నాట్యం మరియు రాగిన్‌ బ్యాండ్‌, మరియు స్థానిక సాంస్కృతిక కళాకారుల నృత్య ప్రదర్శనలతో అందరిని ఆకట్టుకుంది. నైటా నిర్వాహకుల సమష్టి కృషి ఫలితంగా కార్యక్రమం చక్కటి ప్రణాళికతో సజావుగా జరిగింది. సెక్రటరీ రవీందర్‌ కోడెల కార్యక్రమాన్ని ప్రారంభిచగా, యాంకర్‌ లక్ష్మి గారు చక్కటి వాగ్దాటితో కార్యక్రమాన్ని నడిపించారు. చిన్నారుల గణేశాలాపనతో మరియు స్థానిక కళాకారుల నృత్య ప్రదర్షణతో కార్యక్రమం మొదలవగా పేరిణి కళాకారుల నృత్యప్రదర్శన మొట్ట మొదటిసారిగా అమెరికా గడ్డపై ప్రత్యక్షంగా ప్రదర్శించడం ఎంతో హర్షదాయకం. 

 సందీప్‌ నేత్రుత్వంలో కిరణ్‌, రోహిత్‌, ఇంద్రజ మరియు అభినయ బృందం వినాయకగద్యం, రామాయణ గట్టం, జూగాల్బండి, ఆకాశలింగ, సమీకరణం, వాయు లింగ, దేవికైవారం, నరసింహ ఘట్టం, శివకల్యాణనమ్‌, నవ దుర్గ ఘట్టం, ప్రదర్శనతో న్యూయార్క్‌ వాసులని మైమరిపించారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్‌ వాణి మాట్లాడుతూ, తెలంగాణలో ప్రసిద్ధి చెందిన, మరుగు పడిపోయిన కాకతీయుల కాలంనాటి ప్రాచీన నృత్యాన్ని సజీవంగా నిలిపి, మొట్టమొదటి సారిగా న్యూయార్క్‌ నగరంలో ప్రదర్శన జరిపించడం ప్రత్యేకంగా తన ప్రెసిడెన్సీ ఆధ్వర్యంలో న్యూయార్క్‌ తెలంగాణ తెలుగు సంఘం తరుపున ఎంతో ఆనందాన్ని వ్యక్త పరిచారు. ఈ సందర్భంగా పేరిణి నాట్య ప్రదర్శనం టైమ్స్‌ స్క్వేర్‌ లో ప్రదర్శించడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా పేరిణి నృత్యాన్ని సామాజిక మధ్యమాల ద్వారా తెలియచేసినందుకు చాలా గర్వంగా ఫీల్‌ అవుతున్నానని ప్రెసిండెంట్‌ వాణి గారు తెలియచేసారు.  ఈ సందర్బంగా సహకరించిన పెద్దలు పైళ్ళ మల్లా రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. 

నైటా మహాశివరాత్రి మరియు ఉమెన్స్‌ డే సందర్భంగా పేరిణి నాట్య ప్రదర్శన తో పాటు స్థానిక యంగ్‌ కిడ్స్‌ నృత్య మరియు స్కిట్స్‌ ప్రదర్శనలు ప్రేక్షకులును ఎంతగానో ఆకట్టుకున్నాయి. మహిళా దినోత్సవం సందర్బంగా అమితాబ్‌ బచ్చన్‌ పోయెట్రీ సాంగ్‌ తో చేసిన్స్‌ నృత్య రూపకం ప్రత్యేకమైనది అని చెప్పవచ్చు.  ఒక మహిళా అధ్యక్షురాలుగా ఈ ప్రదర్శన తన మనస్సుకు ఎంతో అనంధాన్ని ఇచ్చినది అని వాణి పేర్కొన్నారు. ఈ నృత్య రూపకాలని రూపొందించిన నృత్య దర్శకులందరిని జ్ఞాపికలు మరియు శాలువాలతో సత్కరించారు.

ఈ కార్యక్రమం సంధర్భంగా నైటా 2024 సావనీర్‌ను కూడా విడుదల చేశారు. ఈ సావేనేర్‌ రూపకల్పన లో తొడ్పడిన నైటా టీం ముఖ్యంగా పవన్‌ రవ్వ, సౌమ్య చిట్టారి, శ్రీనివాస్‌ గూడూరు, ఉషా మన్నెం గారికి కృతజ్ఞతలను తెలియజేస్తూ ఈ సంచికకు ప్రత్యేక అనువాదకురాలుగా( చీఫ్‌ ఎడిటిర్‌) వ్యవహరించడంపై  ప్రెసిడెంట్‌ వాణి తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ సంంచికను ప్రింట్‌ చేయడంలో తొడ్పడిన దాతలు, రచయితలు, చిన్నారుల పెయింటింగ్‌, బిజినెస్‌ అడ్వర్టిసేమెంట్‌ హోల్డర్స్‌ అందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేయడం జరిగింది. నైటా సంబరాలు సందర్బంగా ఏర్పాటు చేసిన శివలింగం డెకొరేషన్‌ ప్రతేక ఆకర్షణంగా నిలిచింది. దీన్ని తయారుచేయడానికి ఎంతో శ్రమతో కష్టపడి చేసి కార్యక్రమములో ఒక ముఖ్య ఘట్టంగా నిలిచిన ప్రదర్శనకి కృషి చేసిన శ్రీమతి పద్మ కోడెల గారిని వారికి సహకరించిన హారిక జంగం, సౌమ్య చిట్టారి, ప్రీతం గారికి ప్రెసిడెంట్‌ వాణి గారు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. నైటా సంబరాలు సందర్భంగా చివరగా ఏర్పాటు చేసిన ‘‘రాగిన్‌ బ్యాండ్‌’’ సంగీత విభావరి ఏకధాటిగా రెండు ఘంటల పాటు కొలహాలంగా కేరింతలతో సాగింది. రాగిన్‌ బ్యాండ్‌ తమ యొక్క ప్రదర్శన మొట్టమొదటి సారిగా న్యూయార్క్‌ మహానగరంలో నైటా  ఆధ్వర్యంలో పరిచయం అవ్వడం చాలా ఆనందాన్ని వ్యక్త పరిచారు.

ఈ సందర్భంగా ప్రెసిడెంట్‌ వాణి మాట్లాడుతూ నైటా ఆధ్వర్యంలో జరిగిన సంబరాలు, మహాశివరాత్రి అండ్‌ ఉమెన్స్‌ డే సెలెబ్రేషన్స్‌ చాలా ఘనంగా జరగడానికి తోడ్పడిన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా కార్యక్రమనికి సహకరించిన దాతలందరికి మరియు కార్యక్రమానికి వచ్చిన కమ్యూనిటీ మెంబెర్స్‌ అందరికి, రవీందర్‌ కోడెల, సౌమ్య, హరిచరణ్‌ బొబ్బిలి, సుధీర్‌ చూవ్వా, హారిక జంగం, హేమ వెంకట, షాలిని మేఖల గారికి కూడా కూడా ప్రెసిడెంట్‌ వాణి ధన్యవాదములు తెలిపారు. మరీముఖ్యంగా సహాయ సహకారాలు అందించిన బోర్డు అఫ్‌ డైరెక్టర్స్‌ మరియు అడ్వైసరీ మెంబెర్స్‌ అయిన చైర్మన్‌ డా. రాజేందర్‌ రెడ్డి జిన్నా, వైస్‌  చైర్మన్‌ లక్ష్మణ్‌ అనుగు, సతీష్‌ కల్వ, డా. కృష్ణ భాదే, ఉషా మన్నెం, పవన్‌ రవ్య, మల్లిక్‌ రెడ్డి, సహోదర్‌ రెడ్డి, వేణు రెడ్డి, పాస్ట్‌ ప్రెసిడెంట్‌ సునీల్‌ రెడ్డి గడ్డం, అడ్వైసర్స్‌, శ్రీనివాస్‌ గూడూరు, రమ వనమ, చిన్న బాబు రెడ్డి, మధుసూదన్‌ రెడ్డి గారిలకు ధన్యవాదాలు తెలియచేయడం జరిగింది. ఈ కార్యక్రమం సందర్భంగా నైటా చక్కటి విందు భోజనం ఏర్పాటు చేయటం జరిగింది. 

 

Click here for Photogallery

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :