దేవర ప్లానింగ్ సూపర్ గురూ..

ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాలతో దేవర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తారక్ కెరీర్లో 30వ సినిమాగా తెరకెక్కుతోంది. ఆచార్య తర్వాత కొరటాల చేస్తున్న సినిమా ఇదే కావడంతో ఆ సినిమా ఎఫెక్ట్ దీనిపై ఎక్కడా పడకుండా ఉండేలా కొరటాల ఎంతో జాగ్రత్తగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
అందులో భాగంగానే స్క్రిప్ట్ ను చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుని మరీ షూట్ స్టార్ట్ చేశారు. మొదటి షెడ్యూల్ లో యాక్షన్ సీక్వెన్స్ ను స్టార్ట్ చేసి, రెండో షెడ్యూల్ లో యాక్షన్ సీక్వెన్స్ తో పాటూ టాక పార్ట్ కూడా తెరకెక్కించారు. రీసెంట్ గా మూడో షెడ్యూల్ ని ఫిల్మ్ సిటీలో పూర్తి చేశాడు కొరటాల. ఈ సినిమా నుంచి తారక్ కు దొరికిన ఫ్రీ టైమ్ లో తను ఒప్పుకున్న యాడ్స్ కు సంబంధించిన షూటింగ్ లో పాల్గొంటున్నాడు.
అయితే ఈ సినిమాకు సంబంధించిన తర్వాతి షెడ్యూల్ జూన్ మొదటి వారంలో జరగబోతుందట. ఈ షెడ్యూల్ లో తారక్ తో పాటూ మిగిలిన ప్రధాన తారాగణం అంతా షూటింగ్ లో పాల్గొనబోతుందట. వీరి కాంబోలో టాకీ పార్ట్ తెరకెక్కించాలని కొరటాల ప్లాన్ చేశారట. జూన్ లో తన డేట్స్ మొత్తాన్ని దేవర సినిమాకే ఎన్టీఆర్ కేటాయించినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే మరో వైపు కొరటాల, అనిరుధ్ ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా చేస్తున్నారట. మొత్తానికి తారక్ నవంబర్ కు దేవరను ఫినిష్ చేసుకుని, డిసెంబర్ లో హృతిక్ తో కలిసి వార్-2 షూటింగ్ లో జాయిన్ కానున్నాడట. వార్2 కోసం ఎన్టీఆర్ మూడు నెలలు డేట్స్ ఇచ్చినట్లు సమాచారం. వార్2 పూర్తయ్యాక ప్రశాంత్ నీల్ తో సెట్స్ పైకి వెళ్లనున్నాడు ఎన్టీఆర్.






