ఎన్టీఆర్, జాన్వీల బీచ్ సాంగ్

ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ హీరోగా వస్తున్న సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. యువ సుధ ఆర్ట్స్ మారియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.
శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా రీసెంట్ గా గోవా షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. గోవా షెడ్యూల్ లో కీలక సన్నివేశాలతో పాటూ ఓ ఫీల్ గుడ్ లవ్ సాంగ్ ను కూడా తెరకెక్కించినట్లు సమాచారం. ఈ సాంగ్‌కు అనిరుధ్ ఎంతో మంచి మ్యూజిక్‌ను అందించినట్లు తెలుస్తోంది.
బీచ్ లో సాగనున్న ఈ మెలోడీ సాంగ్ అవ్ అండ్ రొమాంటిక్ గా ఉండబోతుందట. ఈ సాంగ్‌లో జాన్వి గ్లామర్ తర్వాతి స్థాయిలో ఉండబోతుందని, ఈ స్పెషల్ సాంగ్ ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేయనుందని సమాచారం. సినిమా మొత్తానికి ఎన్టీఆర్, జాన్వీల కెమిస్ట్రీ హైలైట్ గా నిలవనుందంటున్నారు. దేవర1 వచ్చే యేడాది ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.






