ఎన్నారై సైంటిస్టుకు అరుదైన గౌరవం.. రీజెంట్స్ ప్రొఫెసర్ అవార్డు ప్రదానం

ఎన్నారై సైంటిస్టుకు అరుదైన గౌరవం.. రీజెంట్స్ ప్రొఫెసర్ అవార్డు ప్రదానం

అగ్రరాజ్యం అమెరికాలో తెలుగు ఎన్నారై సైంటిస్టుకు అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణలోని వరంగల్ జిల్లా చెర్లపల్లికి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ సాంబ రెడ్డికి టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీ తమ అత్యున్నత పురస్కారం అందించింది. ఈ యూనివర్సిటీలో రీజెంట్స్ ప్రొఫెసర్ అవార్డుతో డాక్టర్ సాంబ రెడ్డిని సత్కరించింది. ఆయన సేవలకు కేవలం తమ సంస్థలోనే కాకుండా సమాజానికి, టెక్సాస్ స్టేట్‌పై కూడా ప్రభావం చూపించాయని, ఈ క్రమంలో ఆయన చేసిన కృషిని గుర్తిస్తూ ఈ అవార్డు ప్రదానం చేసినట్లు యూనివర్సిటీ వెల్లడించింది. తెలంగాణలోని కాకతీయ వర్సిటీలో ఫార్మసీ డిగ్రీ పూర్తి చేసిన సాంబ రెడ్డి.. పంజాబ్ యూనివర్సిటీలో మాస్టర్స్, డాక్టోరల్ డిగ్రీలు అందుకున్నారు. అనంతరం వాషింగ్టన్‌లోని యూఎస్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్‌లో పోస్ట్‌డాక్టోరల్ ఫెల్లోషిప్ పూర్తి చేశారు. ప్రస్తుతం టెక్సాస్ ఏ అండ్ ఎం స్కూల్ ఆఫ్ మెడిసిన్‌ల్ ప్రొఫెసర్‌గా సేవలు అందిస్తున్నారు. 2008లో ఈ వర్సిటీలో చేరిన ఆయన.. ఎపిలెప్సీ న్యూరోథెరపాటిక్స్‌లో అధ్యయనాలు చేస్తూ న్యూరో స్టెరాయిడ్స్ విభాగంలో ఎన్నో పరిశోధనలను ముందుండి నడిపించారు.

 

 

Tags :