ASBL NSL Infratech

నాట్స్ నాయకుడు బాపయ్య చౌదరి సేవలకు నీతి ఆయోగ్ ఆఫ్ ఇండియా గుర్తింపు

నాట్స్ నాయకుడు బాపయ్య చౌదరి సేవలకు నీతి ఆయోగ్ ఆఫ్ ఇండియా గుర్తింపు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం  నాట్స్ గత రెండేళ్లలో చేసిన సేవలను భారత నీతి ఆయోగ్ గుర్తించింది. ఈ రెండేళ్లలో నాట్స్ అధ్యక్షుడిగా బాపయ్య చౌదరి(బాపు) నూతి చేసిన సేవా కార్యక్రమాలు సమాజంలో స్ఫూర్తిని నింపేలా ఉన్నాయని నీతి అయోగ్ కొనియాడింది. బాపు నూతి సేవలను అభినందిస్తూ నీతి ఆయోగ్ సభ్యులు పద్మభూషణ్ డాక్టర్ విజయ్ కుమార్ సరస్వత్ గుర్తింపు పత్రాన్ని బాపు నూతికి అందించారు. గత రెండు సంవత్సరాలుగా వేలాది మందికి సహాయక సేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు బాపు నూతికి ఈ అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీలోని నీతి ఆయోగ్ భవన్ లో బాపు నూతికి గుర్తింపు పత్రాన్ని ఇచ్చి విజయ్ కుమార్ అభినందించారు. 

ముఖ్యంగా నాట్స్ మన గ్రామం-మన బాధ్యత కార్యక్రమం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక సేవా కార్యక్రమాలు, దివ్యాంగుల కోసం ఆటిజం కేర్ అండ్ వీల్ పేరుతో మొబైల్ ఏర్పాటు చేయడాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆటిజం కేర్ ఆన్ వీల్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ, అటవీ ప్రాంతాలలో దివ్యాంగులకు సహాయపడే విధంగా డాక్టర్స్, ఫిజియోథెరపిస్ట్, ఎడ్యుకేషన్ కిట్స్ ను పంపించి వారి ఎదుగుదలకు తోడ్పాటు అందించడం చాలా గొప్ప విషయం అని విజయ్ కుమార్ అన్నారు. నాట్స్, స్పర్ష్ ఫౌండేషన్  సంస్థలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని దివ్యాంగులకు, పిల్లలకు సేవా కార్యక్రమాలతో పాటు మొబైల్ వ్యాన్ ని ఏర్పాటు చేసి డాక్టర్స్ ద్వారా సేవలను అందించడం అభినందనీయమన్నారు. దివ్యాంగులకు పునరావాస కార్యక్రమాలు చేపట్టడం, గ్రామీణ గిరిజన తండాల్లోని వైద్య సేవలు, అవసరమైన వారిని గుర్తించి  సహాయం అందించడం స్ఫూర్తిదాయకమన్నారు.

ఈ కార్యక్రమంలో బాపు నూతి తో పాటు నాట్స్ డల్లాస్ నాయకులు రవి తాండ్ర, స్పర్ష్ ఫౌండేషన్ అధినేత పంచముఖి, డా. జ్యోతిర్మయి పాల్గొన్నారు.

 

Click here for Photogallery

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :