మెగా రూమర్లపై నాగబాబు అయినా స్పందిస్తాడా?

నాగబాబు కూతురు నిహారికకు తన భర్త చైతన్యతో అభిప్రాయబేధాలు వచ్చాయనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇన్‌స్టాలో వీరిద్దరూ ఒకరినొకరు అన్ ఫాలో అవడం, వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు డిలీట్ చేయడం, గత కొన్నాళ్లుగా వీరిద్దరూ కలిసిన ఫోటో ఒక్కటి కూడా అప్డేట్ చేయకపోవడం ఈ వార్తలకు ఇంకా ఆజ్యం పోస్తున్నాయి.
గతంలో చైతన్యను హీరోగా లాంచ్ చేసే ప్రయత్నంలో మెగా ఫ్యామిలీ ఉందని వార్తలొచ్చాయి. నిహారికకు సంబంధించిన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, హలో వరల్డ్ వెబ్ సిరీస్‌ల పనులు కూడా చైతన్య చూసుకున్నాడు. కానీ ఇప్పుడు మాత్రం వీరిద్దరూ కలిసి బయట కనిపించి కూడా చాలా రోజులే అయింది. ఈ విషయం గురించి మెగా ఫ్యామిలీ గురించి కనీసం ఎవరూ స్పందించట్లేదు కూడా.
మొన్నీ మధ్య చిన్న కూతురు శ్రీజ కూడా కళ్యాణ్ తో బ్రేకప్ చేసుకుందన్న వార్తలు వినిపించాయి. దీని గురించి అఫీషియల్ గా క్లారిటీ రాలేదు కానీ ఉన్నట్లుండి కళ్యాణ్ నుంచి సినిమాలు రాకపోవడం, చిరంజీవి కూడా దీనిపై ఎక్కడా ప్రస్తావించకపోవడంతో ఆ వార్తలకు బలం చేకూరింది. మరి ఈ మెగా రూమర్లపై ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నాగబాబు అయినా స్పందిస్తాడేమో చూడాలి.
ఏదైనా సరే మూడేళ్ల కిందట ఎంతో వైభవంగా ఒక్కటైన ఈ జంట గురించి, ఇంత తక్కువ టైమ్ లోనే ఇలాంటి వార్తలు రావడం బాధాకరమే. గతంలో చైతూ సమంతలు విడిపోయినప్పుడు ఆ న్యూస్ చాలా హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే.