జగన్ బెయిల్ రద్దు కేసుపై సుప్రీంకోర్టు విచారణ..
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. జగన్ బెయిల్ రద్దు చేయాలి అంటూ ఎంపీ రఘు రామకృష్ణ రాజు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై ఈరోజు విచారణ జరిగింది. అంతేకాదు కేసు విచారణ తెలంగాణలో కాకుండా వేరే రాష్ట్రంలో జరగాలి అని కోరుతూ రఘు రామకృష్ణ రాజు మరో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్ లను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలో ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా అక్రమాస్తుల కేసుల విచారణ ఆలస్యం అవ్వడం పై సిబిఐ ను ధర్మాసనం ప్రశ్నించింది. నాలుగు వారాల్లో కేసు విచారణ ఎందుకు ఆలస్యం అవుతుంది అన్న విషయాన్ని స్పష్టం చేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. అలాగే విచారణ వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా.. విచారించే వ్యక్తి సీఎం లేక రాజకీయ నేత అనే కారణంతో విచారణ జాప్యం జరగకూడదు అని అన్నారు. ఇక ఈ కేసు విషయంలో తదుపరి విచారణ ఆగస్టు లో ఉంటుంది.