ASBL NSL Infratech

డిజిట‌ల్ రంగంలో నెట్ ఫ్లిక్స్ వండ‌ర్స్

డిజిట‌ల్ రంగంలో నెట్ ఫ్లిక్స్ వండ‌ర్స్

లాస్ట్ ఇయ‌ర్ వ‌ర‌కు గ్లోబ‌ల్ కంటెంట్ ను టార్గెట్ చేసి ఫారిన్, ఇంగ్లీష్, హిందీ భాష‌ల సినిమాల‌కే ప్రాధాన్యం ఇస్తూ సౌత్ మార్కెట్ ను నిర్ల‌క్ష్యం చేసింది నెట్‌ఫ్లిక్స్‌. ఇదెంత పెద్ద త‌ప్పో చాలా లేట్ గా తెలుసుకుంది నెట్ ఫిక్ల్స్ యాజ‌మాన్యం. లేట‌యినా లేటెస్ట్ గా వ‌స్తామ‌న్న‌ట్లు దానికి త‌గ్గ‌ట్టు బిజినెస్ ప్లాన్ ను మార్చుకుంది.

ఆచి తూచి పెద్ద హీరోల సినిమాల‌ను స్ట్రీమింగ్ చేసే ట్రెండ్ లో జ‌స్ట్ 20 రోజుల గ్యాప్ లో స‌లార్ పార్ట్1, యానిమ‌ల్, గుంటూరు కారం సినిమాల‌ను రిలీజ్ చేసి ఒక్క‌సారిగా ఓటీటీ మార్కెట్ ను కుదిపేసింది నెట్‌ఫ్లిక్స్. గ‌తంలో అమెజాన్ ప్రైమ్ కూడా ఇలానే ఒకానొక ద‌శ‌లో ఓటీటీల‌ను డామినేట్ చేసింది.  

క‌రోనా టైమ్ లో దృశ్యం2, నారప్ప‌, నాని వి, ఆకాశం నీ హ‌ద్దురా, ట‌క్ జ‌గ‌దీశ్ లాంటి సినిమాల‌ను డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేసి ఎంతో లాభ‌ప‌డింది ప్రైమ్ వీడియో. కానీ త‌ర్వాత వెబ్ సిరీస్‌ల‌పై ఫోక‌స్ చేయ‌డంతో సినిమాల‌ను కొన‌డం త‌గ్గించేసింది. ఈ గ్యాప్ ను నెట్‌ఫ్లిక్స్ క్యాష్ చేసుకుంటుంది. ఇందులో భాగంగానే నెట్ ఫ్లిక్స్ ఏకంగా రూ. వెయ్యి నుంచి రెండు వేల కోట్ల వ‌ర‌కు పెట్టుబ‌డులు పెట్టి పాన్ ఇండియా సినిమాల‌ను కొంటూ వెళ్తుంది. అందుకే ఎంత పోటీ ఉన్నా దేవ‌ర‌, పుష్ప2 లాంటి సినిమాల హ‌క్కుల‌ను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగ‌లిగింది. ఈ పోటీని త‌ట్టుకునేందుకు హాట్ స్టార్ కూడా కొత్త ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్న‌ట్లు తెలుస్తోంది. మొత్తానికి నెట్ ఫ్లిక్స్ ఒక నెల రోజుల్లో మూడు క్రేజీ సినిమాలు రిలీజ్ చేసి డిజిట‌ల్ రంగంలో సంచ‌ల‌నాలు సృష్టించింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :