రాలేలో ఎన్‌బికె అభిమానుల సందడి

నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ విడుదల సందర్భంగా రాలేలో ఉన్న ఎన్‌బికె అభిమానులు, టీడిపి అభిమానులు సందడి చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించి ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, శ్రీలీల తదితరులు నటించిన ఈ చిత్రం విడుదల సందర్భంగా రాలేలో సినిమా రిలీజ్ అవుతున్న థియేటర్ ముందు కేక్ కట్ చేసి మరీ అభిమానులు పండగ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మిధున్ సుంకర, రవికిషోర్ లామ్, కేశవ్ వేముల, వంశీ బొట్టు, రాజేష్ యార్లగడ్డ, మూర్తి అక్కిన, రామ్ అల్లు, శ్రీపాద కాసు, సురేష్ వెలంకి, కుమార్ చల్లగొల్ల తదితరులు పాల్గొన్నారు.







Tags :