నాట్స్ మద్దతుతో ‘వాక్ ఎ మైల్ - హెల్ప్ ఎ ఛైల్డ్’

నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (నాట్స్) ఆధ్వర్యంలో ‘వాక్ ఎ మైల్ - హెల్ప్ ఎ ఛైల్డ్’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 28, శనివారం నాడు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు ఈ కార్యక్మం జరుగుతుంది. టెక్సాస్‌లోని రిడ్జ్‌పాయింట్ పార్క్ వేదికగా ఈ నడక కార్యక్రమం జరగనుంది. హ్యాండ్ ఇన్ హ్యాండ్ యూఎస్ఏ సంస్థ నిర్వహిస్తున్న ఈ 5కే వాకథాన్ కార్యక్రమానికి నాట్స్ పూర్తి మద్దతు ఇస్తోంది. అనాథలు, పేద విద్యార్థులకు ఉచిత విద్య, ఆహారం, వైద్యం తదితర సేవలు అందజేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.







Tags :