ఏపీ లో ఎన్నికల పరిస్థితి పై నరేష్ వైరల్ ట్వీట్..
ఏపీలో ఎన్నికలకు గట్టిగా 40 రోజుల సమయమే ఉంది. ఈసారి ఎన్నికలు మునుపెన్నడూ లేనంత హై టెన్షన్ క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పటికే ప్రత్యర్ధులు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేలుస్తుంటే.. సెలబ్రిటీలు కూడా దానికి తోడు అవుతున్నారు. సినిమా వాళ్లు డైరెక్టుగా రాజకీయాల్లోకి దిగకుండా ఏదో ఒక పార్టీని సపోర్ట్ చేస్తూ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. రీసెంట్ గా సినీ నటుడు నరేష్ చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఉన్న టెన్షన్ చాలదు అన్నట్లు సీనియర్ నటుడు నరేష్.. ఏపీలో అధికార మార్పు జరిగే లోపే రక్త పాతం జరగడానికి అవకాశాలు చాలా ఉన్నాయి అంటూ ఓ ట్వీట్ పెట్టారు. ఈసారి ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈసారి అధికారంలోకి రాకపోతే వైసీపీ కి ఎంత కష్టమో.. అధికారం చేజిక్కించుకోకపోతే టీడీపీ, జనసేనలకు కూడా అంతకంటే కఠినం. నరేష్ చేసిన ట్వీట్ వెనక వివేక హత్య కూడా ఒక కారణం ఉండి ఉండొచ్చు. గత ఎన్నికలకు ముందు వివేకాహత్య, కోడి కత్తి దాడి ఘటనలు ఈసారి కూడా పునరావృతం కావచ్చు అనే ఉద్దేశంతో ఆయన ఈ కామెంట్ చేశారు అని అందరూ భావిస్తున్నారు.