ASBL NSL Infratech

నారా రోహిత్ ల్యాండ్ మార్క్ 20వ చిత్రం “సుందరకాండ” ఫస్ట్ లుక్  

నారా రోహిత్ ల్యాండ్ మార్క్ 20వ చిత్రం “సుందరకాండ” ఫస్ట్ లుక్  

హీరో నారా రోహిత్ ల్యాండ్ మార్క్ 20వ చిత్రం “సుందరకాండ”. దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి ను పరిచయం చేస్తూ సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP) బ్యానర్ పై సంతోష్ చిన్నపొళ్ల, గౌతమ్ రెడ్డి మరియు రాకేష్ మహంకాళి నిర్మించిన వినోదభరితమైన రొమ్-కామ్ చిత్రం “సుందరకాండ”. ప్రతి వ్యక్తికి రిలేట్ అయ్యేలా జీవితం లో ఉండే అన్ని రకాల ఎమోషన్స్ ని చూపించే విధంగా ఈ చిత్రం ఉండబోతుంది నారా రోహిత్ కూల్ అండ్ క్లాసీ అవతార్ లో చేతిలో కుండతో, మరో చేతిలో పుస్తకంతో ఉన్న ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా సినిమాకు సుందరకాండ అనే టైటిల్ ను మేకర్స్ ప్రకటించారు.

పోస్టర్ లో కాలేజీ విద్యార్థులు వ్యతిరేక దిశలో నడుస్తున్నట్లు మనం చూడవచ్చు. ఈ సినిమా విడుదల తేదీని కూడా నిర్మాతలు ప్రకటించారు. ఇది గణేష్ చతుర్థి (సెప్టెంబర్ 7) సందర్భం గా సెప్టెంబర్ 6,2024 న ప్రేక్షకుల ముందుకి రానుంది. సుందరకాండ హిందూ ఇతిహాసం రామాయణంలో ఐదవ పుస్తకం. సినిమాపై పాజిటివ్ ఇంప్రెషన్ని క్రియేట్ చేసే ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఆవిష్కరించడానికి శ్రీరామ నవమి పర్వదినాన్ని సరైన సందర్భం గా భావించి మేకర్స్ ఈ రోజు టైటిల్ మరియు ఫస్ట్ లుక్ విడుదల చేయడం జరిగింది వృతి వాఘని కథానాయికగా నటిస్తుండగా, శ్రీ దేవి విజయ్ కుమార్, నరేష్ విజయ కృష్ణ, వాసుకి ఆనంద్ కీలక పాత్రలు పోషించనున్నారు.

ప్రదీప్ ఎమ్ వర్మ సినిమాటోగ్రఫీ అందించగా, లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సందీప్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత కాగా, రాజేష్ పెంటకోట ప్రొడక్షన్ డిజైనర్, రోహన్ చిల్లాలే ఎడిటర్.  తారాగణం: రోహిత్ నారా, వృతి వాఘని, శ్రీ దేవి విజయ్ కుమార్, నరేష్ విజయ కృష్ణ, వాసుకి ఆనంద్, కమెడియన్ సత్య, అజయ్, VTV గణేష్, అభినవ్ గోమతం, విశ్వంత్, రూపా లక్ష్మి, సునైనా, రఘు బాబు. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :