కుట్రలు, కుతంత్రాలు న్యాయం ముందు.. ఓడిపోయాయి : లోకేశ్

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు రెగ్యులర్ బెయిల్ రావడాన్ని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్వాగతించారు. సత్యం గెలిచింది. అసత్యంపై యుద్ధం మొదలైంది. మన నాయకుడు చంద్రబాబు కడిగిన ముత్యం. చంద్రబాబు నీతి, నిజాయతీ, వ్యక్తిత్వం తలెత్తుకొని నిలబడ్డాయి. తప్పు చేయను. చేయనివ్వను అని చెప్పే చంద్రబాబు మాటలు నిజమయ్యాయి. 50 రోజులైనా ఒక్క ఆధారమూ కోర్టు ముందు ఉంచలేకపోయారు. కుట్రలు, కుతంత్రాలు న్యాయం ముందు ఓడిపోయాయి. ఈ కేసులో ఆరోపించినట్లు షెల్ కంపెనీలు లేవని తేలిపోయింది. చంద్రబాబు రాజకీయ జీవితంపై మచ్చ వేసేందుకు కుట్ర చేశారని తేలిపోయిందని అని లోకేశ్ అన్నారు.







Tags :