వైసీపీ ఓటమి భయంతోనే.. టీడీపీ నేతలపై

వైసీపీ నేతలు ఓటమి భయంతోనే తెలుగుదేశం పార్టీ నేతలపై దాడులకు తెగబడుతున్నారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం భీమవరం టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు మునిరత్నంపై వైసీపీ నేత కొటాల చంద్రశేఖర్ రెడ్డి అనుచరులు హత్యాయత్నం చేయడం దారుణమని ధ్వజమెత్తారు. మునిరత్నం పరిస్థితి విషమంగా ఉంది. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. అతనికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుంది. వైసీపీ ఫ్యాక్షన్ పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి అని అన్నారు.







Tags :