ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ద‌స‌రాను మించేలా నాని - శ్రీకాంత్ మూవీ

ద‌స‌రాను మించేలా నాని - శ్రీకాంత్ మూవీ

స్టార్ హీరోలంతా పాన్ ఇండియా క్రేజ్ ను వాడుకుంటూ భారీ బ‌డ్జెట్ సినిమాలు చేస్తుంటే నాని మాత్రం త‌న రేంజ్ బ‌డ్జెట్ తో సినిమాలు చేస్తూ స‌క్సెస్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. నాని సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనేలా ఇప్పుడు త‌న‌కు క్రేజ్ ఏర్ప‌డింది. అంతేకాదు ద‌స‌రా సినిమాతో నాని త‌న‌లోని మాస్ ను బ‌య‌ట‌పెట్టి అంద‌రినీ షాక‌య్యేలా చేశాడు.

ద‌స‌రా త‌ర్వాత నాని చేసిన హాయ్ నాన్న కూడా మంచి ఫ‌లితాన్నిచ్చింది. ప్ర‌స్తుతం వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వంలో స‌రిపోదా శ‌నివారం చేస్తున్న నాని, ఈ సినిమాతో పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నాడు. ఆగ‌స్ట్ ఎండింగ్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై ఇప్ప‌టికే మంచి బ‌జ్ ఏర్ప‌డింది. ఈ సినిమా త‌ర్వాత నాని, సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌నున్నాడు. ఓజీ సినిమా పూర్త‌య్యాక ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది.

దీంతోపాటూ నాని శ్రీకాంత్ ఓదెలతో కూడా మ‌రో సినిమా చేస్తున్నాడు. ఈసారి ఈ సినిమా ద‌స‌రాను మించేలా ఉంటుంద‌ని టాక్. నాని మ‌రోసారి మాస్ అవ‌తార్ లో క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. ఈ సినిమా పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంద‌ని తెలుస్తోంది. సుజిత్ మూవీ లేట‌యితే నాని శ్రీకాంత్ సినిమాను వెంట‌నే స్టార్ట్ చేయాల‌ని చూస్తున్నాడు. సెప్టెంబ‌ర్ లో మొద‌లుపెట్టి మార్చి ఎండింగ్ నాటికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టినుంచే ఈ సినిమా కోసం భారీ సెట్స్ ను వేస్తున్నార‌ని తెలుస్తోంది.  

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :