హీరోకు ఇష్టం లేకుండానే రిలీజ్ చేస్తున్నారా?
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వస్తోన్న తాజా సినిమా డెవిల్. కళ్యాణ్ రామ్ కెరీర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. కానీ ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ కానీ, ట్రైలర్ అప్డేట్ ఇస్తూ కానీ హీరో నుంచి ఎలాంటి పోస్టూ లేదు. ఇవన్నీ చూస్తుంటే ఓ విషయం స్పష్టమవుతుంది.
నిజమే.. డెవిల్ ను ఈ నెల 29న రిలీజ్ చేయడం కళ్యాణ్ రామ్ కు ఏ మాత్రం ఇష్టం లేదట. సలార్, డంకీ రిలీజైన వారానికే ఈ సినిమాను రిలీజ్ చేసి రిస్క్ తీసుకోవడానికి కళ్యాణ్ రామ్ సుముఖత చూపించడం లేదని ఇన్‌సైడ్ టాక్. దానికి తోడు ఈ పది రోజులు ఎక్కడ చూసినా సలార్, డంకీ ల గురించే మాట్లాడుకుంటారు.
ఇంత పెద్ద సినిమాల మధ్య డెవిల్ ను ప్రమోట్ చేసి జనాలకు రీచ్ అయ్యేలా చేయడం ఆషామాషీ వ్యవహారం కాదని కళ్యాణ్ రామ్ అభిప్రాయ పడుతున్నాడు. కానీ ఈ డేట్ మిస్ అయితే మళ్లీ మార్చి వరకు ఆగాల్సి వస్తుందని ఇదే బెస్ట్ ఆప్షన్ అంటున్నాడట నిర్మాత కమ్ డైరెక్టర్ అభిషేక్. వాస్తవానికి ఇదే సమస్య గతంలో నిఖిల్ చేసిన స్పై సినిమాకు వచ్చింది.
సినిమాలో కొన్ని లోపాలున్నాయని తెలిసి కూడా ప్రొడ్యూసర్ ప్రెజర్ వల్ల ఆ సినిమాను రిలీజ్ చేసి, చివరకు ఫ్లాప్ ను మూటగట్టుకున్నారు. ఇప్పుడు కళ్యాణ్ రామ్ కు కూడా అదే పరిస్థితి ఎదురైంది. కానీ డెవిల్ సినిమాకు మాత్రం యూనిట్ మెంబర్స్ నుంచి చాలా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. మంచి రిలీజ్ డేట్ దొరికితే సినిమా బ్లాక్ బస్టర్ ఖాయమని చాలా నమ్మకంగా చెప్తున్నారు. మరి కళ్యాణ్ రామ్ కు డెవిల్ ఎలాంటి ఫలితాన్ని మిగులుస్తుందో చూడాలి.