ASBL NSL Infratech

నందమూరి బాలకృష్ణ '#NBK108' టైటిల్, ఫస్ట్ లుక్ జూన్ 8న విడుదల

నందమూరి బాలకృష్ణ '#NBK108' టైటిల్, ఫస్ట్ లుక్ జూన్ 8న విడుదల

గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ,  బ్లాక్ బస్టర్ డైరెక్టర్  అనిల్ రావిపూడి   కలిసి #NBK108 తో మాస్, అభిమానులు, ఫ్యామిలీ ఆడియన్స్ కు సరికొత్త అనుభూతిని అందించబోతున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు జరుపుకోనున్నారు. బాలకృష్ణ అభిమానులకు ఇది చాలా ప్రత్యేకమైన పుట్టినరోజు కానుంది.  ఎందుకంటే ఈ బర్త్ డే కి చాలా ట్రీట్‌లు ఉన్నాయి. బాలకృష్ణ పుట్టినరోజు (జూన్ 10)కి రెండు రోజుల ముందుగా అంటే జూన్ 8వ తేదీన ఈ సినిమా టైటిల్,  ఫస్ట్ లుక్‌ను విడుదల చేయనున్నారు. పవర్ ఫుల్ టైటిల్ లాక్ చేశారు. పవర్ ఫుల్ ఫస్ట్-లుక్ పోస్టర్ చూసేందుకు మనం మరో మూడు రోజులు ఆగాలి. జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా పెద్ద సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు.

కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.

ఉగాది సందర్భంగా ఈ సినిమాలో బాలకృష్ణ రెండు డిఫరెంట్ లుక్‌లను ప్రజంట్ చేస్తూ విడుదల చేసిన పోస్టర్ల కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

#NBK108కి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. తమ్మి రాజు ఎడిటర్, రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్. వెంకట్‌ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.  

NBK108 విజయదశమి (దసరా)కి థియేట్రికల్ విడుదలకు సిద్ధమౌతోంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :