విదేశాల్లో బాలయ్య క్రేజ్ మాములుగా లేదుగా.. పార్టీ జెండాలు కట్టి మరీ సందడి

నందమూరి బాలకృష్ణ హీరోగా, శ్రుతిహాసన్ కథానాయికగా దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన యాక్షన్ చిత్రం ‘వీరసింహారెడ్డి’.
- ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కానుంది.
- ఈ నేపథ్యంలో వివిధ దేశాల్లో ఉన్న బాలకృష్ణ అభిమానులు కార్లకు తెలుగుదేశం పార్టీ జెండాలను కట్టి ఎన్బీకే ఆకారంలో వాటిని ప్రదర్శించి తమ వీరాభిమానాన్ని చాటుకున్నారు.
★ నందమూరి బాలకృష్ణ హీరోగా, శ్రుతిహాసన్ కథానాయికగా దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన యాక్షన్ చిత్రం ‘వీరసింహారెడ్డి’.
★ ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కానుంది.
★ ఈ నేపథ్యంలో వివిధ దేశాల్లో ఉన్న బాలకృష్ణ అభిమానులు కార్లకు తెలుగుదేశం పార్టీ జెండాలను కట్టి ఎన్బీకే ఆకారంలో వాటిని ప్రదర్శించి తమ వీరాభిమానాన్ని చాటుకున్నారు.
★ ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్, అమెరికాలోని కాన్సాస్ నగరాల్లో విమాన, వాహన ర్యాలీలను నిర్వహించి సందడి చేశారు.
★ కాన్సాస్ నగరంలో కార్లకు తెలుగుదేశం పార్టీ జెండాలను కట్టి ఎన్బీకే ఆకారంలో వాటిని ప్రదర్శించారు.
★ బ్రిస్బేన్ నగరంలో విమానానికి 'జై బాలయ్య-గాడ్ ఆఫ్ మాసెస్' బ్యానర్ కట్టి ఆకాశంలో ప్రదర్శించారు.
★ ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న వీరసింహారెడ్డి సినిమా పట్ల వివిధ దేశాల్లో బాలయ్య అభిమానుల సందడి రోజురోజుకు పెరుగుతోంది.