ASBL Koncept Ambience
facebook whatsapp X

నాగ్ నెక్ట్స్ ఎవ‌రితో?

నాగ్ నెక్ట్స్ ఎవ‌రితో?

ఈ ఏడాది సంక్రాంతికి కింగ్ నాగార్జున నా సామిరంగ‌తో మంచి స‌క్సెస్ ను అందుకున్నాడు. త‌న సంక్రాంతి హిట్ సెంటిమెంట్ ను ఈ సినిమా మ‌రింత బ‌ల‌ప‌రిచింది. నా సామిరంగ త‌ర్వాత నాగ్ సోలో హీరోగా మ‌రో సినిమాను అనౌన్స్ చేసింది లేదు. ప్ర‌స్తుతం శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ధ‌నుష్ తో క‌లిసి కుబేర అనే మ‌ల్టీస్టార‌ర్ చేస్తున్న నాగ్, ఆ సినిమాలో త‌న పాత్ర‌తో ఆడియ‌న్స్ ను స‌ర్‌ప్రైజ్ చేయ‌నున్నాడ‌ని తెలుస్తోంది.

అయితే నాగ్ సోలో గా వ‌చ్చే సినిమా కోసం ఆయ‌న ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. కోలీవుడ్ డైరెక్ట‌ర్ తో స్టోరీ డిస్క‌ష‌న‌స్ అయిపోయాయి, రేపే మాపో అనౌన్స్‌మెంట్ కూడా వ‌స్తుంద‌న్నారు కానీ ఏమైందో ఏమో నాగ్ ఆ సినిమాకు బ‌దులు ఇప్పుడు మ‌రోసారి నా సామిరంగ కాంబినేష‌న్‌నే రిపీట్ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

నా సామిరంగ షూటింగ్ టైమ్ లోనే విజ‌య్ త‌న ద‌గ్గ‌రున్న క‌థను నాగ్ కు చెప్ప‌గా, ఈ సినిమా హిట్ అయితే చూద్దామ‌న్నార‌ని, ఈ నేప‌థ్యంలోనే ఇప్పుడు విజ‌య్ కు నాగ్ మ‌రో అవ‌కాశాన్నిస్తున్న‌ట్లు తెలుస్తోంది. నాగ్- అఖిల్ తో ఓ మ‌ల్టీస్టారర్ ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమా ఇంకా డిస్క‌ష‌న్స్ లోనే ఉంది. మ‌రి నాగ్ త‌న త‌ర్వాతి సినిమాగా అది చేస్తాడా లేక విజ‌య్ తో చేస్తాడా అన్న‌ది చూడాలి. ఏదేమైనా కానీ త‌న త‌ర్వాతి సినిమా అన్ని వర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకునేలానే ఉంటుంద‌ని ఆయ‌న స‌న్నిహితులు చెప్తున్నారు.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :