అభివృధి అసలు లేదు ..జగన్ పై నాగబాబు ట్వీట్..
మెగా బ్రదర్ నాగబాబు వైఎస్ జగన్ పై.. అతని ప్రభుత్వం పై విమర్శలు కురిపించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి.. దివంగత నేత.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పుత్రరత్నం జగన్ పాలనలో ఏపీలో అభివృద్ధి శూన్యం అని ఆయన అన్నారు. కేవలం జగన్ ఐదేళ్ల పాలనలో ఏపీ 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది.. రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు.. అని నాగబాబు అన్నారు. నాగబాబు.. జగన్ ఇటీవలి నిర్వహిస్తున్న ప్రచారానికి సంబంధించిన వీడియోలను జత చేసి ఒక ట్వీట్ పెట్టారు. రీసెంట్ గా తమ పార్టీ అభ్యర్థులను పరిచయం చేస్తూ ఆర్థికంగా అంతంత మాత్రమే ఉన్నవారు అని జగన్ అనడం మరొకసారి గుర్తు చేసిన నాగబాబు..జగన్ మాటలు అనుకరిస్తూ..జగన్ పాలనలో అభివృద్ధి అంతంత మాత్రం కాదు అసలు లేదు…అంటూ సెటైర్ వేశారు.
మన మాజీ ముఖ్యమంత్రి గారి పుత్రరత్నం ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి,
— Naga Babu Konidela (@NagaBabuOffl) April 2, 2024
సేనాని పేరుని సైతం పలకడానికి జడిసే సౌమ్యుడు గారు అధికారంలో అభివృద్ధి అంతంత మాత్రమే కాదు కాదు అంతా సూన్యమే.. pic.twitter.com/zITrcS73Q2