ASBL NSL Infratech

దెయ్యాలంటే భ‌య‌మంటున్న చైతూ

దెయ్యాలంటే భ‌య‌మంటున్న చైతూ

అక్కినేని నాగ‌చైత‌న్య గ‌త కొంతకాలంగా వ‌రుస ఫ్లాపుల‌తో ఇబ్బంది ప‌డుతున్నాడు. చైతూ నుంచి రీసెంట్ గా వ‌చ్చిన క‌స్ట‌డీ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద దారుణంగా బోల్తా కొట్టింది. దీంతో చైత‌న్య విక్ర‌మ్ కె కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన దూత వెబ్ సిరీస్ పైనే త‌న ఆశ‌ల‌న్నింటినీ పెట్టుకున్నాడు. ప్రైమ్ వీడియో నిర్మించిన ఈ సిరీస్ తో చైతూ ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు.

ఈ సిరీస్ ప్ర‌మోష‌న్స్ లో చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నాడు చైతూ. థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కిన ఈ సిరీస్ ను ప్ర‌మోట్ చేస్తూ నాగ‌చైత‌న్య త‌న ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌ను షేర్ చేసుకున్నాడు. చైతూకి రియ‌ల్ లైఫ్ దెయ్యాలంటే చాలా భ‌య‌మ‌ట‌. కనీసం దెయ్యం ఉన్న సినిమాల‌ను చూడాల‌న్నా భ‌య‌ప‌డాత‌న‌ని చెప్పుకొచ్చాడు.

దూత సిరిస్ త‌ప్ప‌క ఆడియ‌న్స్ ను అల‌రిస్తుంద‌ని, ఈ సిరీస్ మొత్తాన్ని చీక‌టిలో, వ‌ర్షంలోనే షూట్ చేసిన‌ట్లు చెప్పుకొచ్చాడు చైత‌న్య‌. ఇక సినిమాల విష‌యానికొస్తే చైతన్య‌, చందూ మొండేటి ద‌ర్శ‌కత్వంలో గీతా ఆర్ట్స్2 బ్యాన‌ర్ లో తండేల్ అనే సినిమా చేయ‌బోతున్నాడు. ఇప్ప‌టికే దాని కోసం త‌న లుక్ ను కూడా మార్చేశాడు చైతూ.  

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :