మైత్రీ మూవీ మేకర్స్ ఎగ్జిబిషన్ రంగంలోకి కూడా... మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి మైత్రీ సంస్థ

ప్రస్తుతం టాలీవుడ్‌లో భారీ చిత్రాల నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకుంది మైత్రీ మూవీ మేకర్స్. వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డిలతో చిత్రాలతో నైజాం డిస్ట్రిబ్యూటర్స్‌గా మారిన మైత్రీ సంస్థ, ఆ రెండు సినిమాల తో పంపిణి రంగంలో కూడా సక్సెస్ సొంతం చేసుకున్నారు. ఇప్పుడు మైత్రీ సంస్థ మరో కొత్త వ్యాపారంలోకి అడుగు పెడుతున్నట్లు సినీ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గత ఏడాది చివరలో మాత్రం సినిమాల నిర్మాణంతో పాటు డిస్ట్రిబ్యూషన్ రంగంలోనూ అడుగు పెట్టారు. శ్రీ మంతుడు చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుగిడిన మైత్రీ సంస్థ టాలీవుడ్ లో నెంబర్ వన్ సంస్థగా నిలబడింది. ఇంతకీ మైత్రీ వారు ఎంట్రీ ఇస్తోన్న బిజినెస్ ఏంటో తెలుసా! థియేటర్స్.
వివరాల్లోకి వెళితే.. అంటే ఎగ్జిబిషన్ రంగంలోకన్నమాట. ఓసారి ఎగ్జిబిటర్స్‌గారూ మైత్రీ మూవీ మేకర్స్ ప్రయాణం ప్రారంభిస్తే.. కచ్చితంగా తన మార్క్ చూపించుకునే ప్రయత్నం చేస్తుందనటంలో సందేహం లేదు. అందులో భాగంగా గుంటూరులో ఫినిక్స్ నిర్మించిన ఐదంతస్తుల మల్టీప్లెక్స్‌ను మైత్రీ సంస్థ కొనుగోలు చేయటానికి చర్చలు జరుపుతుందట. రూ.30-35 కోట్లతో ఈ డీల్ పూర్తయ్యే అవకాశం ఉందని టాక్. ఈ సంక్రాంతికి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రెండు భారీ చిత్రాలు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య..నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందిన వీరసింహా రెడ్డి చిత్రాలు ఒకేసారి విడుదలయ్యాయి. ఇద్దరు స్టార్ హీరోల సినిమాలను ఒకే నిర్మాతలు రూపొందించి ఒకేసారి విడుదల చేయటం అనేది తెలుగు సినిమా చరిత్రలో ఇదే ప్రథమం. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ పోరులో ఘన విజయాలను సొంతం చేసుకున్నాయి.